News April 4, 2024
NLG: టెన్త్ మూల్యాంకనం షురూ.. వారికి షోకాజ్ నోటీస్

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారం ప్రారంభమైంది. NLGలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఈ ప్రక్రియ చేపట్టారు. మూల్యాంకనం కోసం 92 మంది చీఫ్ ఎగ్జామినర్లను నియమించగా.. 72 మంది రిపోర్టు చేశారు. 551 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లకు గాను 452 మంది, 184 మంది స్పెషల్ అసిస్టెంట్లకు గాను 142 మంది రిపోర్టు చేసి మూల్యాంకనంలో పాల్గొన్నారు. మూల్యాంకనానికి హాజరు కాని వారికి డీఈఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Similar News
News February 12, 2026
నల్గొండ: మున్సిపల్ పోరులో ‘సింహం’ గర్జిస్తుందా?

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో AIFB అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పార్టీల టికెట్లు దక్కని పలువురు నేతలు ‘సింహం’ గుర్తుపై పోటీకి దిగారు. మొత్తం 48 డివిజన్లలో ఫార్వర్డ్ బ్లాక్ తరఫున 11 మంది బరిలో నిలవగా, ఐదుగురు అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉన్నారు. రేపు వెలువడనున్న ఫలితాల్లో సింహం గుర్తు ఏ మేరకు ప్రభావం చూపుతుందోనని నగరంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
News February 12, 2026
నల్గొండ: భారత్ బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు చేపట్టిన ‘భారత్ బంద్’కు కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటించింది. లేబర్ కోడ్‌ల రద్దు, అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటంలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, ర్యాలీల్లో పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
News February 12, 2026
NLG: స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత!

నల్గొండ జిల్లా 3 కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల వద్ద పోలీసులు మూడంచెల భద్రత కల్పించారు. బ్యాలెట్ బాక్సుల వద్ద మొదటి స్టేజీలో తెలంగాణ స్పెషల్ రిజర్వుడ్ పోలీసులతో భద్రత కల్పిస్తుండగా, రెండో స్టేజీలో ఏఆర్ పోలీసులు, మూడో స్టేజీలో సివిల్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.


