News March 20, 2024
NLG: ట్రాక్టర్ ఢీకొని ఫిజికల్ డైరెక్టర్ మృతి

కనగల్ హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ ఎండీ సాజిద్ ఆలీ కనగల్ శివారులో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. గుర్రంపోడు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో పదో తరగతి పరీక్షల డ్యూటీ ముగించుకొని తిరిగి నల్గొండకు వెళుతుండగా అతని బైక్ ను గడ్డి ట్రాక్టర్ ఢీ కొట్టింది. ప్రమాదంలో సాజిద్ అలీ తీవ్రంగా గాయపడ్డారు. 108లో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News November 18, 2025
చిత్తడి నేలల గుర్తింపు పూర్తి చేయాలి: కలెక్టర్

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపు కార్యక్రమాన్ని శనివారం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా చిత్తడి నేలల సంరక్షణ, నిర్వహణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చిత్తడి నేలల గుర్తింపును పూర్తి చేయాలని అన్నారు.
News November 18, 2025
స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌గా డా. కె.అరుణప్రియ

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌గా డా కె.అరుణప్రియను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. డా.కె అరుణప్రియ ప్రస్తుతం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌గా ఏడాది కాలం పాటు సేవలందించనున్నారు. ఈ సందర్భంగా అరుణప్రియను అధికారులు, విద్యార్థులు అభినందించారు.
News November 18, 2025
నల్గొండను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చాలి

నషాముక్త భారత్ కార్యక్రమం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చే దిశగా ప్రతి విద్యా సంస్థ కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఐదో వార్షికోత్సవం నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటానని అందరూ ప్రతిజ్ఞ చేయాలని తెలిపారు.


