News May 26, 2024
NLG: డీసీసీబీ ఛైర్మన్ పై అవిశ్వాసం..?

DCCB బ్యాంకు ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. త్వరలోనే అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు డైరెక్టర్లు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. డైరెక్టర్లలో పలువురు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరడంతో DCCBలో ఆ పార్టీ బలం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అత్యధికంగా ఎమ్మెల్యేలను గెలుచుకోవడంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. డీసీసీబీ పీఠాన్ని అధీనంలోకి తీసుకోవాలని భావిస్తుంది.
Similar News
News November 26, 2025
నల్గొండ: పౌరులందరి హక్కులకు రాజ్యాంగం రక్ష: ఇన్ఛార్జ్ డీఆర్ఓ

భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరి హక్కులకు రక్షణ కల్పిస్తుందని ఇన్‌ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి వై.అశోక్ రెడ్డి అన్నారు. నల్గొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన మౌలిక హక్కులు, బాధ్యతలు ప్రతి పౌరుడు తప్పనిసరిగా తెలుసుకొని, వాటిని ఆచరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
News November 26, 2025
NLG: సర్పంచ్ ఎన్నికలలో వారిని దింపేందుకు ఫోకస్..!

ఎన్నికల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడడంతో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS, BJP దృష్టి సారించాయి. ఆర్థికంగా బలంగా ఉన్న వారితోపాటు, పలుకుబడి ఉన్న వారిని గుర్తించి మద్దతు ఇచ్చే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. జిల్లాలో మొదటి విడతలో 318, 2వ విడతలో 282, 3వ విడతలో 269 జీపీలకు పోలింగ్ జరగనుంది.
News November 26, 2025
మునుగోడు: పత్తి మిల్లులో అనుమానాస్పదంగా కార్మికుడు మృతి

మునుగోడు మండలం కొంపల్లిలోని జై బిందు పత్తి కొనుగోలు కేంద్రంలో మహారాష్ట్రకు చెందిన కార్మికుడు ముస్తఫా జాఫర్ సాఫ్ జలాలు (30) మంగళవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. తహశీల్దార్ నరేష్, చండూరు సీఐ ఆదిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనుమానం ఉన్న శార్దూల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు.


