News February 5, 2025
NLG: తీన్మార్ మల్లన్న విమర్శనలను ఆయన విజ్ఞతకే :మంత్రి

గెలుపు ఓటములు ప్రజలు నిర్ణయిస్తారు..వ్యక్తులు కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తీన్మార్ మల్లన్న బీ ఫాం నాకే ఇచ్చారు..పెద్ద ర్యాలీ చేశామని తెలిపారు. మల్లన్న విమర్శలను ఆయన విజ్ఞతికే వదిలేస్తున్నారు. కాంగ్రెస్ బీ ఫాం మీద గెలిచిన తీన్మార్ మల్లన్న నాపై లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారు. బీసీ మీటింగ్ పెట్టి ఇతర కులాలను తిట్టడం వల్ల ప్రజల మధ్య మనస్పర్థలు వస్తాయన్నారు.
Similar News
News October 24, 2025
రౌడీ షీటర్లకు ఎస్పీ కౌన్సెలింగ్

ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలోని రౌడీ షీటర్స్కు కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్తో సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలగేవారికి పోలీసుల సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
News October 24, 2025
2 రోజులు వర్షాలు.. జాగ్రత్తలు తీసుకోండి: కలెక్టర్

రానున్న 2 రోజులు వర్ష సూచన ఉన్నందున, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ధాన్యం త్వరగా మిల్లులకు తరలించాలని, కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత లేని ధాన్యాన్ని నింపి పంపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ఈ 2 రోజులు కోతలు వాయిదా వేసుకోవాలన్నారు.
News October 24, 2025
NLG: ఆ గ్రామానికి రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం

చిట్యాల(M) ఉరుమడ్లకు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గ్రామానికి చెందిన గుత్తా మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా వ్యవహరించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీగా, ప్రస్తుతం మండలి ఛైర్మన్గా కొనసాగుతున్నారు. మరోవైపు, కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా ఉండగా, అమిత్ రెడ్డి రాష్ట్ర డైరీ ఛైర్మన్గా పనిచేస్తున్నారు. ఒకే గ్రామం నుంచి ఇంత మంది రాజకీయంగా గుర్తింపు పొందడం విశేషం.


