News February 5, 2025

NLG:  తీన్మార్ మల్లన్న విమర్శనలను ఆయన విజ్ఞతకే :మంత్రి 

image

గెలుపు ఓటములు ప్రజలు నిర్ణయిస్తారు..వ్యక్తులు కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తీన్మార్ మల్లన్న బీ ఫాం నాకే ఇచ్చారు..పెద్ద ర్యాలీ చేశామని తెలిపారు. మల్లన్న విమర్శలను ఆయన విజ్ఞతికే వదిలేస్తున్నారు. కాంగ్రెస్‌ బీ ఫాం మీద గెలిచిన తీన్మార్ మల్లన్న నాపై లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారు. బీసీ మీటింగ్ పెట్టి ఇతర కులాలను తిట్టడం వల్ల ప్రజల మధ్య మనస్పర్థలు వస్తాయన్నారు. 

Similar News

News February 8, 2026

NLG: గల్లంతైన వ్యక్తి కోసం NDRF గాలింపు!

image

నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో కారు పడి గల్లంతైన పుల్లయ్య కోసం NDRF బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. నిన్న జరిగిన ప్రమాదంలో భార్య పద్మ మృతదేహం లభించగా, భర్త జాడ తెలియక పలు అనుమానాలకు దారితీస్తోంది. ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ ఘటనను ప్రమాదమా లేక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో అతడిని విచారిస్తున్నారు.

News February 8, 2026

NLG: 22 మంది ఎంఈఓలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు

image

ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన 22 మంది మండల విద్యాధికారులపై (MEOs) నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 30 నాటికి పూర్తి కావాల్సిన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైనందుకు వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల ఉపకార వేతనాల విషయంలో అలసత్వం వహించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దీనిపై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

News February 8, 2026

ముకుందాపురంలో సాగర్ ఎడమ కాలువలో గల్లంతైంది వీరే

image

ముకుందాపురంలో ఓ కారు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన ఈ ఘటనలో కారులోని ప్రయాణిస్తున్న దంపతులిద్దరూ గల్లంతవ్వగా, డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడు. నీటిలో మునిగిపోయిన భార్యభర్తలు త్రిపురారం(M) కంపాసాగర్‌ చెందిన పుల్లయ్య, పద్మగా సమాచారం. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.