News March 5, 2025

NLG: తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందన.!

image

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. కుల గణన అంశంలో తన పాత్రలేదని, గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. తప్పు చేసిన వాడ్ని క్షమించే గుణం తనదన్నారు. తీన్మార్ మల్లన్న ఏ ప్రెస్ మీట్స్ పెట్టుకుంటే.. తనకేంటని జానారెడ్డి పేర్కొన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, సలహాలు అడిగితే ఇస్తానన్నారు. కేసీఆర్ పాత్ర ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

Similar News

News December 4, 2025

ఒక్క వ్యక్తి ఆధారంగా రిజర్వేషన్.. ఎన్నిక బహిష్కరణ

image

TG: STలే లేని పంచాయతీకి ST రిజర్వేషన్ ప్రకటించడంతో నల్గొండ(D) అనుముల(M) పేరూరు గ్రామస్థులు సర్పంచ్ ఎన్నికను బహిష్కరించారు. గతంలో పేరూరు, వీర్లగడ్డ తండా కలిపి ఉమ్మడి పంచాయతీగా ఉండేవి. తరువాత రెండూ విడిపోయాయి. ఆ సమయంలో తప్పుగా నమోదైన ఒకే ఒక్క ఎస్టీ వ్యక్తిని ఆధారంగా తీసుకుని పేరూరు రిజర్వేషన్ కేటాయించారు. ST అభ్యర్థులు లేకపోవడంతో నామినేషన్ దాఖలు చేయలేదు. దీనిపై గ్రామస్థులు HCని ఆశ్రయించారు.

News December 4, 2025

వైసీపీ వల్లే రాజధాని నిర్మాణం ఆలస్యం: నారాయణ

image

AP: వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని అమరావతి నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ విమర్శించారు. బకాయిలు చెల్లించి పనులు ప్రారంభించే నాటికి వర్షాలు ముంచెత్తాయని చెప్పారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో రెండో విడత భూసమీకరణపై గ్రామస్థులతో సమావేశమయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామని పేర్కొన్నారు.

News December 4, 2025

పల్నాడు కోనసీమ మంచికల్లులో పోలేరమ్మ తిరుణాల వైభవం.!

image

పల్నాటి కోనసీమగా పిలవబడే రెంటచింతల మండలం మంచికల్లు గ్రామ దేవత పోలేరమ్మ తిరునాల మహోత్సవం కోర్ల పౌర్ణమి సందర్భంగా గురువారం రోజున పెద్ద ఎత్తున ప్రారంభమైంది. కొన్ని వందల సంవత్సరాలుగా డిసెంబర్‌లో వచ్చే పౌర్ణమి కొర్ల పౌర్ణమిగా పరిగణించి ఈ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తిరుణాలలో మొదట శక్తిని నిలబెట్టి మరుసటి రోజు సాగనంపడం తరతరాల ఆనవాయితీగా వస్తుంది.