News March 15, 2025
NLG: తూకాల్లో మోసం.. కొలతల్లో వ్యత్యాసం!

జిల్లాలో ప్రజలు నిత్యం నిలువు దోపిడికి గురవుతున్నారు. కొన్ని వాణిజ్య, వ్యాపార సంస్థలు తూకాల్లోనే కాదు.. వివిధ రకాల మోసాలకూ పాల్పడుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి రకరకాల తిరకాసులతో వినియోగదారులను నిండా ముంచుతున్నారు. ఏడాది కాలంలో జిల్లాలో తూనికల కొలతల శాఖ అధికారులు 371 కేసులు నమోదు చేశారు. ఇందులో 96 కేసులు తప్పుడు తూకాలకు సంబంధించినవి కావడం గమనార్హం.
Similar News
News April 17, 2026
హైదరాబాద్-సాగర్ రహదారిపై కారు లారీ ఢీ వ్యక్తి మృతి

హైదరాబాద్-సాగర్ రహదారిపై కారు, లారీ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మహబూబ్ నగర్‌కు చెందిన గిరిధర్ గౌడ్ మల్లెపల్లి నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తున్న క్రమంలో పోలేపల్లి(రాంనగర్) వద్ద లారీ ఢీకొనడంతో కారులో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి అవినాష్‌కు తీవ్రగాయాలు అవ్వడంతో మాల్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్మూర్తి తెలిపారు.
News April 17, 2026
NLG: రేషన్ సమస్యలు.. రెండు రోజుల్లో పరిష్కారం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిల్వలు ముగిసి రేషన్ దుకాణాలు మూతపడుతున్నాయన్న వార్తలపై జిల్లా పౌరసరఫరాల అధికారులు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ కోటా కింద NLGతో పాటు KMM, మహబూబాబాద్ జిల్లాలకు ప్రభుత్వం ఇప్పటికే బియ్యం కేటాయించిందని, అందులో సగం రవాణా పూర్తయిందని తెలిపారు. మరో రెండు రోజుల్లో రవాణా ప్రక్రియను పూర్తిస్థాయిలో ముగించి, నిల్వలు లేక మూతపడిన దుకాణాలకు బియ్యాన్ని చేరవేస్తామన్నారు.
News April 17, 2026
ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం అవసరం: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. శుక్రవారం MLGలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాలలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది ఒక్క మిర్యాలగూడ డివిజన్ పరిధిలోనే 93 మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని ఎస్పీ పిలుపునిచ్చారు.


