News March 6, 2025
NLG: తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల

NLG MGUలో ఐసెట్ 2025 నోటిఫికేషన్ను సెట్ ఛైర్మన్, ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ అల్వాల రవి విడుదల చేశారు. జూన్ 8, 9వ తేదీల్లో 4 విడతలుగా తెలంగాణ వ్యాప్తంగా 16 ఆన్లైన్ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 10 నుంచి మే 3 వరకు సమర్పించవచ్చును. పూర్తి వివరాలకు https://icet.tsche.ac.inను సందర్శించాలన్నారు.
Similar News
News March 7, 2025
మిర్యాలగూడ: యువకుడు ఆత్మహత్య.!

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువకుడు రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 25 ఏళ్ల వయస్సు కలిగి బూడిద కలర్ టీ షర్ట్ ధరించి, నల్ల కలరు లోయర్ ధరించి ఉన్నాడు. సమాచారం తెలిసిన వారు రూరల్ ఎస్ఐ లోకేష్ కుమార్ 8712670189కు తెలపాలని కోరారు.
News March 6, 2025
పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన నల్గొండ కలెక్టర్, ఎస్పీ

నల్గొండలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులందరూ ఇంటర్ పరీక్షలు భయపడకుండా రాసి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలన్నారు.
News March 6, 2025
చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలో చండూరు వాసులు

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో చేనేత కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనలతో కూడిన వివిధత కా అమృత మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము బుధవారం సాయంత్రం ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 20 మంది చేనేత హస్త కళాకారులు ఈ ప్రదర్శనకు ఎంపిక కాగా నల్గొండ జిల్లా చండూరుకి చెందిన జాతీయ అవార్డు గ్రహీత గంజి యాదగిరి, జాతీయ మెరిట్ అవార్డు గ్రహీత చిలుకూరు శ్రీనివాసులు వారిలో ఉండడం విశేషం.