News March 6, 2025
NLG: తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల

NLG MGUలో ఐసెట్ 2025 నోటిఫికేషన్ను సెట్ ఛైర్మన్, ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ అల్వాల రవి విడుదల చేశారు. జూన్ 8, 9వ తేదీల్లో 4 విడతలుగా తెలంగాణ వ్యాప్తంగా 16 ఆన్లైన్ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 10 నుంచి మే 3 వరకు సమర్పించవచ్చును. పూర్తి వివరాలకు https://icet.tsche.ac.inను సందర్శించాలన్నారు.
Similar News
News November 16, 2025
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
*విశాఖ స్టీల్ ప్లాంటును తెల్ల ఏనుగుతో పోల్చిన చంద్రబాబు
*ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్, MLA నవీన్ యాదవ్
*హిందూపురంలో మా కార్యాలయంపై టీడీపీ దాడి చేసింది: వైఎస్ జగన్
*రాజమౌళి-మహేశ్ బాబు సినిమా టైటిల్ ‘వారణాసి’.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్
*సౌతాఫ్రికాతో టెస్టు.. విజయానికి చేరువలో భారత్
News November 16, 2025
KNR: విటమిన్ గార్డెన్ పై దృష్టి పెట్టాలి:కలెక్టర్

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విటమిన్ గార్డెన్లపై బయోసైన్స్ ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించి, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. గార్డెన్లను ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడంతో పాటు, పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరల్లోని విటమిన్లు, మినరల్స్ గురించి కూడా విద్యార్థులకు వివరించాలని ఆమె సూచించారు.
News November 16, 2025
KNR: ‘కుక్కకాటు బాధితులకు ప్రత్యేక పర్యవేక్షణ అవసరం’

కుక్కలు, కోతులు కరిచిన వారికి అందిస్తున్న చికిత్సపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం హౌసింగ్ బోర్డు కాలనీలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. చికిత్స కోసం వచ్చిన వృద్ధులతో మాట్లాడి, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇస్తారని వారికి సూచించారు.


