News March 6, 2025

NLG: తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల

image

NLG MGUలో ఐసెట్ 2025 నోటిఫికేషన్‌ను సెట్ ఛైర్మన్, ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ అల్వాల రవి విడుదల చేశారు. జూన్ 8, 9వ తేదీల్లో 4 విడతలుగా తెలంగాణ వ్యాప్తంగా 16 ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 10 నుంచి మే 3 వరకు సమర్పించవచ్చును. పూర్తి వివరాలకు https://icet.tsche.ac.inను సందర్శించాలన్నారు.

Similar News

News March 7, 2025

గద్వాలలో బంగారు వ్యాపారి ఇంట్లో చోరీ

image

గద్వాల జిల్లా కేంద్రంలోని రాజా వీధిలో బంగారు వ్యాపారి సంజీవ్ ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడు సంజీవ్ కథనం ప్రకారం వివరాలు.. గురువారం ఉదయం తమ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 7 తులాల బంగారము 5.1/4 కేజీల వెండి, రూ.1 లక్ష 30 వేల నగదు అపహరించారని తెలిపారు. ఘటనా స్థలానికి పట్టణ ఎస్ఐ కళ్యాణ్ చేరుకొని వేలు ముద్ర ఆధారాలు స్వీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 7, 2025

మంథని: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

మంథని మండలం బిట్టుపల్లి గ్రామ మూల మలుపు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. బైక్‌‌పై వెళ్తున్న వ్యక్తి చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందా మరొకరికి గాయాలయ్యాయి. మృతిని పేరు ఉదయ్‌గా గుర్తించారు. గాయాలైన వ్యక్తిని అంబులెన్స్‌లో మంథని హాస్పిటల్‌కి తరలించారు. హైదరాబాద్ (గచ్చిబౌలి) నుంచి రెండు బైక్‌లపై నలుగురు యువకులు ఖమ్మంపల్లిలో స్నేహితుని వివాహానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

News March 7, 2025

MBNR: 25% రాయితీ పొందండి: స్పెషల్ కలెక్టర్

image

ఈ నెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించుకొని ప్రభుత్వం కల్పించిన 25% శాతం రాయితీని పొందాల్సిందిగా స్పెషల్ కలెక్టర్ మున్సిపల్ ప్రత్యేక అధికారి శివేంద్ర ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. గురువారం మున్సిపల్ లో చేసిన ఎల్ఆర్ఎస్ హెల్ప్ లైన్ సెంటర్లను ఆయన పరిశీలించారు. పరిశీలించారు హెల్ప్ లైన్ సెంటర్ను సంప్రదించి తమ దరఖాస్తులను పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు.

error: Content is protected !!