News February 4, 2025

NLG: తొలిరోజు ఒక్క నామినేషన్ దాఖలు

image

వరంగల్ – ఖమ్మం- నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు ప్రజావాణి పార్టీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 10 వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని, ఈనెల 8, 9 తేదీలలో ప్రభుత్వ సెలవు దినాలలో ఎలాంటి నామినేషన్లు స్వీకరించడం జరగదని తెలిపారు.

Similar News

News December 22, 2025

అమెరికాలో నల్గొండ యువకుడి మృతి

image

నల్గొండ మండలం మేళ్ల దుప్పలపల్లికి చెందిన పవన్ రెడ్డి శనివారం తెల్లవారుజామున అమెరికాలో మృతి చెందాడు. బీటెక్ పూర్తి చేసిన పవన్ ఎంఎస్ చదివేందుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. మిత్రులతో కలిసి పార్టీలో పాల్గొన్న అతను అకస్మాత్తుగా చనిపోయాడు. పోస్టుమార్టం అనంతరం మరింత సమాచారం తెలిసే అవకాశముంది. ఉద్యోగానికి ఎంపికయ్యాడని, ఇంతలో ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

News December 22, 2025

నల్గొండ: పశువుల ఆస్పత్రిలోనే పంచాయతీ పాలన!

image

నిడమనూరు మండలంలోని పలు జీపీలకు సొంత భవనాలు లేక పాలన అద్దె గదుల్లోనే సాగుతోంది. నిడమనూరు మేజర్ పంచాయతీ భవన నిర్మాణం 11 ఏళ్లుగా అసంపూర్తిగానే ఉండటంతో, ప్రస్తుతం పక్కనే ఉన్న పశువుల ఆస్పత్రిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో అటు సిబ్బంది, ఇటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నిధులు విడుదల చేసి సొంత భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

News December 22, 2025

NLG: జిల్లాకు నాలుగు ట్రామా కేర్ సెంటర్లు

image

జిల్లాలో కొత్తగా 4 ఆస్పత్రుల్లో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ సెంటర్ ద్వారా క్షతగాత్రులకు గోల్డెన్ అవర్లో మెరుగైన, తక్షణ చికిత్స అందడంతో ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలోని DVK, MLG, నాగార్జునసాగర్, NKL ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతలో DVK, MLG ఏరియా ఆసుపత్రుల్లో పనులు ప్రారంభించనున్నారు.