News June 24, 2024

NLG: దయనీయంగా పాడి రైతుల పరిస్థితి

image

పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు 2.80 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని ఓ అంచనా. పెండింగ్ బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడంతో వారు ఆర్థికంగా సతమతమవుతున్నారు. పశు పోషణ రోజురోజుకూ తలకు మించిన భారంగా మారుతోందని వాపోతున్నారు. 53 రోజులుగా పాల బిల్లులు విడుదల చేయకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

Similar News

News December 20, 2025

సోమవారం యథావిధిగా ‘ప్రజావాణి’: నల్గొండ కలెక్టర్

image

ఎన్నికల కోడ్‌ ముగియడంతో జిల్లాలో నిలిచిపోయిన ‘ప్రజావాణి’ కార్యక్రమం తిరిగి ఈ సోమవారం నుంచి యథావిధిగా అర్జీలను స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం విదితమే. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి బాధితులు తమ ఫిర్యాదులను సమర్పించవచ్చని ఆమె తెలిపారు.

News December 20, 2025

మీ డబ్బు.. మీ సొంతం: కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

image

నల్గొండ జిల్లాలోని బ్యాంకుల్లో సుమారు రూ.66 కోట్ల క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఉదయాదిత్య భవన్‌లో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నామినీ వివరాలు లేకపోవడం, కేవైసీ అప్‌డేట్ చేయకపోవడం వల్ల ఈ నిధులు నిలిచిపోయాయని వివరించారు. ఖాతాదారులు వెంటనే తమ బ్యాంకు వివరాలు సరిచూసుకుని, నిబంధనల ప్రకారం సొంత నిధులను క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు.

News December 20, 2025

నల్గొండ: ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల

image

నల్గొండ ఎన్జీ ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాల డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మహాత్మా గాంధీ వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డా.ఉపేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డా.సముద్రాల ఉపేందర్‌తో కలిసి ఫలితాలను ప్రకటించారు. నవంబర్ 2025లో జరిగిన ఈ పరీక్షల ఫలితాలను విద్యార్థులు కళాశాల వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.