News October 26, 2024
NLG: దరఖాస్తుకు.. నేడే ఆఖరి తేదీ

ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ సీహెచ్.సైదులు తెలిపారు. జనరల్ డ్యూటీ అసిస్టెంట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీ షియన్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, డయాలసిస్ టెక్నీషియన్ కోర్సుల్లో MLGలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నేడే ఆఖరీ తేదీ అని రెడ్డి కాలనీ, MLGలో దరఖాస్తులు అందజేయాలన్నారు.
Similar News
News January 7, 2026
పాడిపై చలిపంజా: తగ్గుతున్న పాల ఉత్పత్తి!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో చలి తీవ్రత పాడి పరిశ్రమపై పెను ప్రభావం చూపుతోంది. డిసెంబర్ నుంచి చలి పెరగడంతో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 15 లక్షల పశువులు ఉండగా, 5 లక్షల పశువుల ద్వారా రోజుకు 25 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం చలి కారణంగా లీటర్ల కొద్దీ దిగుబడి తగ్గి, పాడి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
News January 7, 2026
నల్గొండ మున్సిపాలిటీది ఘనచరిత్ర

నల్గొండ మున్సిపాలిటీకి ఘనచరిత్రే ఉన్నది. నల్గొండను 1951లో 12 వార్డులతో గ్రేడ్ 3 మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జనాభా పెరగడం.. పట్టణం క్రమంగా విస్తరించడంతో 1987లో 24 వార్డులతో గ్రేడ్ 2గా.. 2005లో 36 వార్డులతో గ్రేడ్ 1గా అప్ గ్రేడ్ చేశారు. 2018లో గ్రేడ్ 1గా ఉన్న మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయింది. ప్రస్తుతం నల్గొండ మున్సిపాలిటీలో 2.5 లక్షల మేర జనాభా ఉన్నది.
News January 7, 2026
నల్గొండ: బైకర్లూ.. హెల్మెట్ల బూజు దులపండి!

నల్గొండ జిల్లాలో నేటి నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధన అమలులోకి రానుంది. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయవద్దని బంకు యజమానులకు సూచించారు. ప్రాణ రక్షణ కోసం బైకర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.


