News September 28, 2024
NLG: దసరా బంపర్ ఆఫర్లు.. మన జిల్లాలోనే!

తెలంగాణలో అతిపెద్ద పండగ ‘దసరా’. ఈ పండుగకు వస్త్ర, నగల వ్యాపార సంస్థలు భారీగా ఆఫర్లను పెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. NLG జిల్లాలోని లెంకలపల్లి, వెల్మకన్నె గ్రామాలలోని యువకులు వినూత్నంగా ఆలోచించి ఓ ఆఫర్ పెట్టారు. 2024 దసరాకు బంపర్ ఆఫర్ అంటూ.. ‘రూ. 100 కొట్టు మేకను పట్టు’ అనే ఆఫర్ పెట్టారు. ఆఫర్‌లో మేక, నాటు కోళ్లు, మందు బాటిళ్లు గెలిచిన వారికి బహుమతిగా ప్రకటించారు.
Similar News
News July 10, 2025
జూలై 18న మూసీ కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల

మూసీ ప్రాజెక్ట్ నుంచి వానాకాలం సాగు సీజన్‌కు సంబంధించిన నీటి విడుదలను జూలై 18న ప్రారంభించనున్నట్లు ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్ తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 641.63 అడుగుల నీరు నిల్వ ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు, సూర్యాపేటకు తాగునీరు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.
News July 10, 2025
NLG: ముందస్తుకు మురిసి.. ఇప్పుడేమో దిగులు!

ఉమ్మడి జిల్లా రైతులకు ఈ వానాకాలం అనుకూలించడం లేదు. గతేడాది ఇదే సమయంలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కానీ, ఈ సీజన్లో రైతులకు ఆ పరిస్థితి లేదు. ముందస్తు వర్షాలకు మురిసిన రైతులు ఇప్పుడు దిగులు పడుతున్నారు. మే నెలలో కురిసిన వర్ణాలకు కొందరు దుక్కులు దున్నుకుని పత్తి విత్తనాలను వేస్తే.. మరికొందరు పొలాలు నారు పోసుకున్నారు.
News July 10, 2025
NLG: ‘ఎంపీడీవోలు పనితీరును మెరుగు పరచుకోవాలి’

అన్ని ప్రభుత్వ పథకాలలో పురోగతి తీసుకువచ్చేలా ఎంపీడీవోలు పనితీరును మెరుగుపరచుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీవోలతో వివిధ అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో అతిసారం, నీటి వల్ల సంక్రమించే వ్యాధులు పెరగకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత పూర్తిగా గ్రామ పంచాయతీలదేనని అన్నారు.