News October 12, 2024

NLG: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?

image

దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.

Similar News

News November 17, 2025

శాలిగౌరారం: Way2News ఎఫెక్ట్.. ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం

image

శాలిగౌరారం(M) ఆకారం గ్రామంలో ఉన్న అతి పురాతనమైన సూర్య దేవాలయం జీర్ణోద్ధరణకు ఇక్కడి యువత నడుం బిగించింది. ఇటీవల Way2Newsలో ‘నాడు ఘన చరిత్ర.. నేడు శిథిలావస్థ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ఆకారం, పెర్కకొండారం గ్రామానికి చెందిన 400 మంది యువకులు, యువజన సంఘాలు శ్రమదానం చేసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ ఆలయ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

News November 17, 2025

నల్గొండ ఎస్పీ పేరుతో ఫేక్ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్

image

నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. దీంతో ఈ నకిలీ ఐడీ నుంచి వచ్చే ఎలాంటి మెసేజ్‌లకు, రిక్వెస్ట్‌లకు స్పందించవద్దని ప్రజలకు ఎస్పీ సూచించారు. ఆకతాయిలు ఇలాంటి ఫేక్ ఐడీలు సృష్టించి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

News November 17, 2025

నల్గొండలో నూతన డిజిటల్ లైబ్రరీ ప్రారంభం

image

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతన డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ ఈ డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ బాలమ్మ, గాదే వినోద్ రెడ్డి, ప్రమీల సహా జిల్లా గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.