News October 14, 2024
NLG: ధాన్యం కొనుగోలు సమస్యలపై కంట్రోల్ రూమ్ ప్రారంభించిన కలెక్టర్
జిల్లాలో వానాకాలం ధాన్యం సేకరణకు సంబంధించి సమాచారం, ఫిర్యాదుల స్వీకరణకు ఉద్దేశించి కలెక్టరేట్‌లోని జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ నారాయణరెడ్డి ఈరోజు ప్రారంభించారు. ధాన్యం కొనుగోలులో ఏవైనా సమస్యలు తలెత్తిన 9963407064 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.
Similar News
News November 6, 2024
నాగుల చవితితో కిక్కిరిసిన దేవాలయాలు
నాగుల చవితి జిల్లా వ్యాప్తంగా దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మహిళలు ఉదయం నుంచి రాత్రి వరకు దేవాలయాలలో పుట్టల వద్ద, నాగదేవత విగ్రహాలకు పాలు, పండ్లు, గుడ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నల్లగొండ పట్టణంలోని పానగల్ చారిత్రాత్మక పచ్చల, ఛాయా సోమేశ్వర దేవాలయాలు, ధరేశ్వరం రేణుక ఎల్లమ్మ దేవాలయం, మర్రిగూడెంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంతో పాటు పలు దేవాలయాలలో పూజలు నిర్వహించారు.
News November 6, 2024
సమగ్ర కుటుంబ సర్వేకు 3,964 ఎన్యుమరేషన్ బ్లాకులు: కలెక్టర్ త్రిపాఠి
కుటుంబ సర్వేకు 3,964 ఎన్యుమరేషన్ బ్లాకులు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. 3,483 మంది ఎన్యుమరేటర్లను నియమించామని, 349 మందిని రిజర్వులో ఉంచామని, మొత్తం 3832 మంది ఎన్యుమరేటర్లు ఈ సర్వేలో పాల్గొననున్నారని వెల్లడించారు. కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు 349 మంది సూపర్వైజర్ లను, రిజర్వులో మరో 37 మందిని మొత్తం 386 మంది సూపర్వైజర్లను నియమించామన్నారు.
News November 6, 2024
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల కుటుంబాల వివరాల సేకరణకు గాను ఎన్యుమరేటర్లను, సూపర్‌వైజర్లను నియమించడమే కాకుండా, వారికి శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశామని ఆమె వెల్లడించారు.