News September 26, 2024

NLG: ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

image

NLG జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. రైతుల ద్వారా బయోమెట్రిక్ లేదా ఐరిస్ సేకరించిన తర్వాతే ధాన్యం కొనుగోలు చేయాలనే విధానాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలలో గతంలో ఇచ్చిన బయోమెట్రిక్ పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

Similar News

News October 5, 2024

రైతుబంధులో అవకతవకలు జరిగాయి: మంత్రి పొంగులేటి

image

రైతుబంధులో అవకతవకలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తిరుమలగిరి మం. నెల్లికల్‌లో భూసమస్యల పరిష్కారం కోసం రైతులతో ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్టిఫికెట్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

News October 5, 2024

NLG: బీఈడీ ఫలితాలు విడుదల

image

MG యూనివర్సిటీ పరిధిలో బీఈడీ సెమిస్టర్ ఫలితాలను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి ఉపేందర్ రెడ్డి, అడిషనల్ కంట్రోలర్ లక్ష్మీప్రభ శుక్రవారం విడుదల చేశారు. నాలుగో సెమిస్టర్‌లో 92.6 శాతం, మూడో సెమిస్టర్లో 79.30 శాతం, రెండో సెమిస్టర్లో 84.96 శాతం, మొదటి సెమిస్టర్లో 77.7 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫలితాల కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News October 5, 2024

యాదాద్రి: భార్యను హత్య చేసిన భర్త

image

మద్యం మత్తులో భార్యను భర్త హత్య చేసిన ఘటన అడ్డగూడూరు మండలం డి.రేపాకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోనుగ స్వరూప, కృష్ణారెడ్డి దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. మద్యానికి బానిసైన కృష్ణారెడ్డి తాగి వచ్చి భార్య స్వరూపతో గొడవపడి హత్య చేశాడు. సాధారణ మరణంగా చిత్రీకరించబోయి దొరికిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.