News September 29, 2024
NLG: నల్గొండకు కావాలి హైడ్రా!
నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసినా అక్రమార్కుల్లో భయం కనిపించడం లేదు. నల్గొండ పట్టణంతో పాటు పరిసర మండలాల్లో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి ప్రభుత్వ స్థలాల్లో ఫ్లాట్లు ఏర్పాటుచేసి విక్రయించినట్లు తెలుస్తోంది. అధికారులు వీటిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News October 15, 2024
నకిరేకల్-నాగార్జున సాగర్ హైవేకు నిధుల విడుదల
నల్గొండ జిల్లా అభివృద్ధిపై కేంద్రం ఫోకస్ చేసింది. నకిరేకల్-నాగార్జున సాగర్ మధ్య హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 14 కి.మీ. మేర 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.516 కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. గుంటూరు-నల్లపాడు మధ్య రూ.98 కోట్లతో 4 లైన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
News October 15, 2024
NLG: తప్పుడు FIR.. ఎస్ఐ సస్పెండ్
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం ముల్కలపల్లిలో ఇటీవల ఓ మహిళ హత్య జరిగింది. ఈ కేసు విచారణలో ఎస్ఐ వి.నారాయణరెడ్డి నిర్లక్ష్యం వహించడంతో పాటు నిందితులను తప్పించేందుకు తప్పుడు FIR, వివరాలు నమోదు చేయించి, రూ.లక్ష లంచం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేయగా నిజమని తేలడంతో ఎస్ఐని సస్పెండ్ చేస్తున్నట్లు ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇదే కేసులో ఓ సీఐ, కానిస్టేబుల్‌పై విచారణ సాగుతోంది.
News October 15, 2024
సూర్యాపేట: ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి: పీఆర్టీయూ
సూర్యాపేట జిల్లాలో అవసరం ఉన్న ప్రతి పాఠశాలకు డీఎస్సీ-2024 అభ్యర్థులతో ఖాళీలను భర్తీ చేయాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల నరేశ్ కోరారు. మంగళవారం డీఎస్సీ 2024 సెలెక్టెడ్ అభ్యర్థుల కౌన్సెలింగ్ ప్రారంభం కానుండగా ఆయన డీఈవో అశోక్‌తో సమావేశమయ్యారు. అభ్యర్థులు ఇబ్బందులకు గురికాకుండా కౌన్సెలింగ్‌లో అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్నారు.