News March 5, 2025

NLG: నాన్నా.. నీ ప్రేమకు సలాం..!

image

ఆడబిడ్డ.. అందులోనూ దివ్యాంగురాలు.. ఆమెకు చదువెందుకులే అని ఆ తండ్రి అనుకోలేదు. దివ్యాంగురాలైతేనేం తన బిడ్డ సరస్వతి మాతకు ప్రతిరూపం అంటూ ఆ తండ్రి చెబుతున్నాడు.మర్రిగూడ(M) శివన్నగూడెంకు చెందిన సత్యనారాయణ, ధనమ్మ దంపతుల కూతురు మోర శివానికి ఫ్లోరసిస్ కారణంగా చిన్నప్పుడే కాళ్లు పనిచేయడం లేదు. నేడు మోడల్ స్కూల్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష రాసేందుకు తండ్రి తన బిడ్డను ఎత్తుకుని తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచారు.

Similar News

News December 20, 2025

పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: అల్లూరి కలెక్టర్

image

పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పిల్లల తల్లిదండ్రులు సహకరించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ పిలుపునిచ్చారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ విధిగా పోలియో వేయించాలని సూచించారు. శనివారం పాడేరు ఐటీడీఏ కార్యాలయం వద్ద నిర్వహించవలసిన పోలియో కార్యాక్రమానికి సంబంధించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈనెల 21, 22, 23వ తేదీల్లో పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు.

News December 20, 2025

HYD: ‘ఫ్రీ లెఫ్ట్’ రూల్‌పై పోలీసుల సూచనలు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వాహనదారులు ‘ఫ్రీ లెఫ్ట్’ నిబంధనను కచ్చితంగా పాటించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. లెఫ్ట్ లేన్‌ను అడ్డుకోవడం వల్ల ట్రాఫిక్ జామ్‌ ఏర్పడి ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. రోడ్డుపై ఓపిక, మర్యాదతో కూడిన డ్రైవింగ్ అవసరమని, స్మూత్ ట్రాఫిక్ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలుచోట్ల ప్రత్యేక సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.

News December 20, 2025

బాపట్ల కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

image

చీరాలలో యూరియా విక్రయాలను బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ శనివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందన్నారు. యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాల ద్వారా మాత్రమే యూరియా కొనుగోలు చేయాలని సూచించారు.