News March 5, 2025
NLG: నాన్నా.. నీ ప్రేమకు సలాం..!

ఆడబిడ్డ.. అందులోనూ దివ్యాంగురాలు.. ఆమెకు చదువెందుకులే అని ఆ తండ్రి అనుకోలేదు. దివ్యాంగురాలైతేనేం తన బిడ్డ సరస్వతి మాతకు ప్రతిరూపం అంటూ ఆ తండ్రి చెబుతున్నాడు.మర్రిగూడ(M) శివన్నగూడెంకు చెందిన సత్యనారాయణ, ధనమ్మ దంపతుల కూతురు మోర శివానికి ఫ్లోరసిస్ కారణంగా చిన్నప్పుడే కాళ్లు పనిచేయడం లేదు. నేడు మోడల్ స్కూల్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష రాసేందుకు తండ్రి తన బిడ్డను ఎత్తుకుని తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచారు.
Similar News
News March 22, 2025
ఎల్ఆర్ఎస్ ఫీజు వసూళ్లపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

ఎల్ఆర్ఎస్ ఆమోదించిన దరఖాస్తులకు సంబంధించిన లబ్ధిదారుల నుంచి ఫీజు వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సత్య శారద తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి ధన కిషోర్ ఎల్ఆర్ఎస్‌పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎల్ఆర్ఎస్ 2020 స్కీం కింద ఫ్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు 41,443 దరఖాస్తులు రాగా.. అందులో 18,943 మంజూరు చేయగా, 100% ఫీజు వసూల్ చేయాలన్నారు.
News March 22, 2025
గూడూరు: రోడ్డుపై మొసలి కలకలం

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో ఉన్న పాకాల వాగు వద్ద మొసలి కలకలం రేపింది. ఎండలు తీవ్రంగా ఉండటంతో చెరువులు, వాగులు, కుంటలల్లో చుక్క నీరు లేకుండా పోయింది. దీంతో శుక్రవారం రాత్రి పాకాల వాగు వద్ద మొసలి రోడ్డు పైనుంచి దాటుతుండంతో గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
News March 22, 2025
హైదరాబాద్‌లో భారీ వర్షం

TG: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, హైదర్ నగర్, నిజాంపేట్ తో పాటు నగరంలోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున వర్షం పడుతోంది. ఉరుములు మెరుపులతో భారీగా గాలులు వీయడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ వర్షం పడిన సంగతి తెలిసిందే.