News September 14, 2024
NLG: నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలి: ఎస్పీ
నల్గొండ జిల్లాలో సోమవారం నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా SP శరత్ చంద్ర పవార్ తెలిపారు. అన్ని ప్రధాన రహదారులతో పాటు వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ CC TV కెమెరాలతో పాటు ప్రత్యేకంగా CC కెమెరాలను ఏర్పాటు చేసి, జిల్లా పోలీసు కార్యాలయానికి అనుసంధానం చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు చేశామని తెలిపారు.
Similar News
News October 15, 2024
నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం
నాగార్జునసాగర్ జలాశయానికి ప్రస్తుతం 61,440 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. అవుట్ ఫ్లో 40,912 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 589.00 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312.50 TMCలు కాగా ప్రస్తుతం నీటి నిలువ సామర్థ్యం 307.2834 TMCలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
News October 15, 2024
భువనగిరి: ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుల సమావేశంలో పాల్గొన్న ఎంపీ
మహారాష్ట్ర ,ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ముంబైలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రమేశ్ చేన్నితల, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నానా పటోలే ఆధ్వర్యంలో జరుగుతున్న ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుల సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ వంశీ చందర్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
News October 15, 2024
నల్గొండ: విద్యుత్ శాఖలో ముగిసిన బదిలీల ప్రక్రియ
నల్గొండ జిల్లాలో విద్యుత్ శాఖ మూడు డివిజన్ల పరిధిలో బదిలీల ప్రక్రియ ముగిసింది. 34 మంది లైన్ ఇన్స్పెక్టర్లు, 126 మంది లైన్మెన్లు, 30 మంది అసిస్టెంట్ లైన్మెన్లు, ఇద్దరు జూనియర్ లైన్మెన్లు బదిలీ అయ్యారు. నల్గొండ డీఈ (ఆపరేషన్) అన్నమయ్య పదోన్నతి పై హైదరాబాద్ నుంచి నల్గొండకు వచ్చారు. నల్గొండలో పనిచేస్తున్న వెంకటేశ్వర్లు భువనగిరికి బదిలీ అయ్యారు.