News July 8, 2024
NLG: నిర్మించి రెండేళ్లు.. స్థానికంగా ఉండని అధ్యాపకులు!

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల నివాసం ఉండేందుకు ఏర్పాటు చేసిన స్టాఫ్ క్వార్టర్స్ నిరుపయోగంగా మారాయి. రూ. 6.66 కోట్లతో మొత్తం 16 క్వార్టర్స్ను నిర్మించారు. నిర్మాణాలు పూర్తై రెండేళ్లు కావొస్తున్నా అధ్యాపకులు ఇక్కడ ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. చాలా మంది అధ్యాపకులు నిత్యం HYD నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. అధ్యాపకులు స్థానికంగా ఉంటే చదువులు, పరిశోధనల పరంగా మరింత మేలు జరిగే అవకాశం ఉంది.
Similar News
News December 5, 2025
నల్గొండ: ధాన్యం కొనుగోలులో వేగంపై కమిషనర్ ఆదేశాలు

ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో పారదర్శకత, వేగం పెంచాలని గురువారం రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు. కొనుగోలు కేంద్రాలు, పేమెంట్ జాప్యం, సీఎంఆర్ సరఫరా, రవాణా వ్యవస్థపై సమీక్ష చేసి, పూర్తి డిజిటలైజేషన్తో ట్యాబ్ ద్వారా తేమ, తూకం, రైతు రిజిస్ట్రేషన్ వివరాలు పర్యవేక్షించాలన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో పేమెంట్లు రైతుల ఖాతాల్లో జమ కావాలని ఆదేశించారు.
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు.. నల్గొండ జిల్లా వ్యయ పరిశీలకుడిగా ఆదిత్య

నల్గొండ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఎస్.వెంకట్ ఆదిత్యను జిల్లా వ్యయ పరిశీలకుడిగా గురువారం నియమించారు. ఎన్నికల వ్యయం పర్యవేక్షణ, అభ్యర్థుల ఖర్చుల నమోదు, అక్రమ ఖర్చుల నియంత్రణపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తారని అధికారులు తెలిపారు.
News December 5, 2025
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న నల్గొండ కలెక్టర్

ఎస్ఈసీ కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి జిల్లాలకు కేటాయించిన ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్లు, పంచాయితీరాజ్, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని జిల్లాలో చేసిన ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. పోటీ లేకుండా జరిగే గ్రామ పంచాయతీల్లో కూడా కోడ్ అమలులో ఉంటుందన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలన్నారు.


