News January 1, 2025

NLG: నిలిచిన రేషన్ బియ్యం సరఫరా

image

డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఈరోజు నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. కార్మికుల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా అన్ని గోదాములలో ఎగుమతి, దిగుమతి నిలిచిపోయింది. సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గతంలో అధికారులకు వినతిపత్రాలు ఇచ్చామని, స్పందించకపోవడంతో సమ్మెకు దిగామని హమాలీ నాయకులు అంటున్నారు. 

Similar News

News January 11, 2026

నల్గొండ: ఏసీబీలో ‘లీక్’ వీరులు..!

image

అవినీతి తిమింగలాలను పట్టించాల్సిన ACBలోనే కొందరు ‘లీకు వీరులు’ తయారవ్వడం కలకలం రేపుతోంది. దాడులు నిర్వహించాల్సిన సిబ్బందే, సదరు అవినీతి అధికారులకు ముందస్తు సమాచారం ఇస్తూ వారి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నల్గొండ ఏసీబీ విభాగంలో పనిచేస్తున్న ఓ CI, హోంగార్డు కలిసి ఈ దందాను నడిపిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ మొదలైనట్లు తెలుస్తోంది.

News January 11, 2026

రైతు భరోసా… ఇంకెంతకాలం నిరీక్షణ!

image

రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం జిల్లాలోని రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 5,65,803 మంది పట్టాదార్ రైతులు ఉండగా యాసంగి సీజన్‌పై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. గత ఏడాది జనవరి 26నే ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కాగా.. ఈసారి నవంబర్‌లో సీజన్ ప్రారంభమై ఈ నెలాఖరుకు ముగుస్తున్నా నిధుల ఊసే లేదు. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

News January 11, 2026

NLG: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలచే భర్తీ చేయబడే ఉద్యోగాలతోపాటు బ్యాంకింగ్, RRB ఇతర పోటీ పరీక్షలకు ఎస్సీ స్టడీ సర్కిల్స్‌లో ఉచిత రెసిడెన్షియల్, శిక్షణకు అసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి బి.శశికళ తెలిపారు. అభ్యర్థులను పోటీ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారని, ఫిబ్రవరి 8న జరిగే పరీక్షలో పాల్గొనాలని కోరారు.