News January 1, 2025

NLG: నిలిచిన రేషన్ బియ్యం సరఫరా

image

డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఈరోజు నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. కార్మికుల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా అన్ని గోదాములలో ఎగుమతి, దిగుమతి నిలిచిపోయింది. సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గతంలో అధికారులకు వినతిపత్రాలు ఇచ్చామని, స్పందించకపోవడంతో సమ్మెకు దిగామని హమాలీ నాయకులు అంటున్నారు. 

Similar News

News January 19, 2025

పెరిగిన యాదగిరీశుడి నిత్య ఆదాయం

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం 1500 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా కళ్యాణ కట్ట ద్వారా రూ.75,000, ప్రసాద విక్రయాలు రూ.12,32,330, VIP దర్శనాలు రూ.6,75,000, బ్రేక్ దర్శనాలు రూ.2,58,600, కార్ పార్కింగ్ రూ.5,50,000, వ్రతాలు రూ.1,42,400, సువర్ణ పుష్పార్చన రూ.97,400, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.42,98,487 ఆదాయం వచ్చినట్లు ఆలయ EO భాస్కరరావు తెలిపారు.

News January 18, 2025

రేపు భువనగిరికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

image

యాదాద్రి భువనగిరి జిల్లాకు ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రానున్నారు. ఉదయం 10.30 గంటలకు HYD నుంచి బయలుదేరి 11.45 నిమిషాలకు భువనగిరి పట్టణానికి చేరుకుంటారు. అనంతరం మీనా నగర్ కాలనీలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ సతీమణి రోజా పార్ధివ దేహానికి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 12:45కు బయలుదేరి 2గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

News January 18, 2025

NLG: రేషన్ కార్డు లేని కుటుంబాలు 27,527

image

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. రేషన్ కార్డుల సర్వేపై జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మాట్లాడారు. కులగణన సర్వే రిపోర్టు ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో తయారు చేసిందని తెలిపారు. జిల్లాల్లో 27,527 రేషన్ కార్డుల లేని కుటుంబాలు ఉన్నట్లు లెక్క తేలిందని తెలిపారు.