News May 11, 2024
NLG: నేటితో ప్రచారానికి తెర….!

పార్లమెంట్ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 5 గంటలకు బంద్ కానుంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సమావేశాలు, కార్నర్ మీటింగ్ లను పెద్ద ఎత్తున నిర్వహించగా, వారం రోజులుగా ఇంటింటి ప్రచారం చేపట్టాయి. కాంగ్రెస్, బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు బహిరంగ సభల్లో పాల్గొనగా బీఆర్ఎస్ కు సంబంధించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి సభల్లో పాల్గొన్నారు.
Similar News
News February 13, 2025
10 జీపీఏ సాధించిన వారిని విమానంలో తీసుకెళ్తా: కలెక్టర్

కేజీబీవీ విద్యార్థినులు 10వ తరగతిలో పదికి పది జీపీఏ మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె కనగల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో ముఖాముఖి నిర్వహించి.. వారితో సెల్ఫీ దిగారు. పదవ తరగతిలో 10-10 జీపీఏ సాధించిన వారిని విజయవాడ, చెన్నై లాంటి పట్టణాలకు విమానంలో తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
News February 13, 2025
NLG: ఎంజీయూలో నూతన నియామకాలు..

MG యూనివర్సిటీ పరీక్షల విభాగంలో అసిస్టెంట్ కంట్రోలర్‌గా డా. ఎం. రామచందర్ గౌడ్, కాంపీటేటీవ్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్‌గా సోషల్ వర్క్ విభాగ అధిపతి, డా. ఎస్ శ్రవణ్ కుమార్‌ను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఒక ఏడాది పాటు ఆ స్థానాల్లో సేవలు అందించనున్నారు. సహ అధ్యాపకుల నియామకం పట్ల అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
News February 12, 2025
నల్గొండ: కుమారుడి బాధ్యతను నెరవేర్చిన కుమార్తె

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో చేపూరి బాబురావు (45) ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి సంతానంగా కుమార్తెలు కావడంతో పెద్ద కుమార్తే తండ్రికి తలకొరివి పెట్టి, కుమారుడు లేని లోటు తీర్చింది. అలాగే మృతదేహానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి పుష్ప పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.