News June 6, 2024
NLG: నేటి నుంచి బడిబాట షురూ..!

జిల్లాలో నుంచి నేటి ఈ నెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా విద్యా శాఖ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈనెల 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించేందుకు జయశంకర్ బడిబాట పేరుతో ఈ కార్యక్రమానికి విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు.
Similar News
News October 23, 2025
NLG: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి: కలెక్టర్

అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం సరైన తేమ, నాణ్యత ప్రమాణాలు కలిగి ఉన్నట్లయితే తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని చెప్పారు. బుధవారం ఆమె దాన్యం సేకరణపై పౌర సరఫరాలు, సంబంధిత శాఖల అధికారులతో తన ఛాంబర్లో కలెక్టర్ సమీక్షించారు.
News October 23, 2025
NLG: నేడే లాస్ట్.. ఇప్పటివరకు అందిన దరఖాస్తులు 4653!

నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాలకు బుధవారం మరో 24 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా.. నేటి వరకు 4,653 దరఖాస్తులు అందాయని తెలిపారు. కొత్త మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల గడువు నేటితో ముగిస్తుందని తెలిపారు.
News October 22, 2025
నల్గొండ: మైనర్ బాలిక కేసులో నిందితుడికి 32 ఏళ్ల జైలు శిక్ష

మైనర్ బాలికను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకొని, అత్యాచారం చేసిన కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు గురజాల చందుకు ఏకకాలంలో మొత్తం 32 ఏళ్ల జైలు శిక్ష, రూ.75 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.