News October 15, 2024

NLG: నేడు కొత్త టీచర్లకు పోస్టింగ్..!

image

డీఎస్సీ 2024 ఫలితాల్లో ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు మంగళవారం పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఇప్పటికే వారు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ జిరాక్స్, జాయినింగ్ లెటర్ సమర్పించారు. 535 మంది నూతన ఉపాధ్యాయులు మెరిట్ (ర్యాంకుల) ఆధారంగా ఖాళీల పోస్టులను ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. అనంతరం మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించి తాము ఎంపిక చేసుకున్న పాఠశాలకు పోస్టింగ్ ఇస్తారు.

Similar News

News November 12, 2024

నల్గొండ: రైతన్నకు ‘మద్దతు’ ఏది?

image

ఆరుగాలం కష్టపడి పని చేసిన రైతులకు మద్దతు ధర దక్కడం లేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటివరకు NLG, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ధాన్యం క్వింటాకు రూ.2150 నుంచి 2300 వరకే చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. కొనుగోలు ప్రారంభంలో రూ.2500 పైచిలుకు చెల్లించి కొనుగోలు చేసిన మిల్లర్లు.. మార్కెట్లకు ధాన్యం పోటెత్తుతుండడంతో ధాన్యం ధరలు పూర్తిగా తగ్గించు కొనుగోలు చేస్తున్నారని రైతులకు తెలిపారు.

News November 12, 2024

NLG: స్టేట్ లెవెల్‌లో రాణిస్తున్న అక్కా చెల్లెళ్లు

image

సత్యం పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని నడిమి తండాకు చెందిన లావుడి హరి, నీలమ్మ కూతుర్లు గాయత్రి, ప్రియాంక బాస్కెట్ బాల్ పోటీల్లో రాణిస్తున్నారు. నవంబర్ 9 తేదీ మహబూబ్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన అండర్ -19 స్టేట్ లెవెల్ బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచారు. మారుమూల తండా నుంచి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరచడం పట్ల కుటుంబ సభ్యులు, తండావాసులు హర్షం వ్యక్తం చేశారు.

News November 12, 2024

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి: ఎస్పీ

image

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ రైస్ మిల్లుల యజమానులను కోరారు. 110 రైస్ మిల్లుల వద్ద పోలీసులను ఏర్పాటు చేశామని, రైతులు దళారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని, ధాన్యం అమ్మకాలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రైస్ మిల్లుల యజమానులను కోరారు. రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.