News January 18, 2025

NLG: నేడు జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష

image

ఉమ్మడి జిల్లాలో జవహర్ నవోదయ (ఆరో తరగతి) ప్రవేశ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. NLG జిల్లాలో 13, BNGలో 5, SRPT జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో 80 సీట్లు ఉన్నాయనీ ప్రిన్సిపాల్ నాగభూషణం తెలిపారు. 80 సీట్లలో 75% గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.

Similar News

News February 12, 2025

ఈతకు వచ్చి మునుగోడు యువకుడి మృతి

image

నల్గొండ మండలం నర్సింగ్ భట్లలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వచ్చి మునుగోడు మండలం గూడపూర్‌కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడపూర్‌కు చెందిన వ్యక్తి నర్సింగ్ భట్లలోని AMRP కాలువలోకి ఈతకు వచ్చి నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు.

News February 12, 2025

నేడు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి 

image

నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి NLG జిల్లాకు రానున్నారు. ఉదయం 7:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9:30 గంటలకు నార్కెట్ పల్లి మండలం గోపలాయిపల్లి గ్రామంలోని శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు. అనంతరం తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన రాజిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించనున్నారు.

News February 12, 2025

NLG: మహిళా టీచర్ల సమస్యల పరిష్కారానికే పోటీ: అర్వ స్వాతి

image

మహిళా టీచర్ల సమస్యలను కౌన్సిల్లో తీర్చేందుకే స్వతంత్ర మహిళ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి అర్వ స్వాతి తెలిపారు. తన నామినేషన్ స్క్రూటినీలో ఓకే అయిన సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో 4 సార్లు జరిగిన ఎన్నికలలో మహిళలు పోటీలో లేరని, మెజారిటీ మహిళలు సంఘ బాధ్యులుగా లేని కారణంగా ఏ సంఘం మహిళా అభ్యర్థులను పోటీకి నిలపలేదని, పురుష అభ్యర్థులను గెలిపిస్తే మహిళల సమస్యలు పరిష్కరించలేదన్నారు.

error: Content is protected !!