News August 27, 2024
NLG: నేడు యాదాద్రికి గవర్నర్ రాక

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నారు. మంగళవారం యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ సన్నిధిలో ఏర్పాటు చేసిన విరాళాల సేకరణ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. తిరిగి 29న మరోసారి జిల్లాకు విచ్చేసి కొలనుపాక, స్వర్ణగిరి క్షేత్రాలను సందర్శించనున్నారు. మంగళవారం ఉదయం రాజ్భవన్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా కొండపైకి ఏడు గంటలకు చేరుకుంటారు.
Similar News
News November 7, 2025
NLG: వేతన బకాయిల కోసం ఎదురుచూపులు

చాలీచాలని వేతనాలు.. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల కారణంగా పెట్టిన పెట్టుబడి రాక మధ్నాహ్న భోజన పథకం నిర్వాహకులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. వీటికి తోడుగా గత 6 నెలలుగా జిల్లా వ్యాప్తంగా వేతన బకాయిలు రాకపోవడంతో మధ్నాహ్న భోజన పథకం నిర్వాహకులకు నిర్వహణ మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరాణ దుకాణాల నుంచి సరుకులు అరువు తెచ్చి భోజనం వండుతున్నామని తెలిపారు.
News November 7, 2025
పోలీస్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన

వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో శుక్రవారం గీతాలాపన కార్యక్రమం జరిగింది. పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ పూర్తిస్థాయి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. 1875 నవంబర్ 7న బంకిం చంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని రచించారని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.
News November 7, 2025
Way2News కథనానికి నల్గొండ కలెక్టర్ స్పందన

‘ఇసుక కొరత.. ఇంటి నిర్మాణం జరిగేది ఎట్లా?’అనే శీర్షికతో ఈ నెల 4న Way2Newsలో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మైనింగ్ శాఖ అధికారులు జిల్లాలోని ఇసుక రీచ్లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.


