News June 7, 2024

NLG: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక అప్డేట్

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు 26 మంది ఎలిమినేట్‌ అయ్యారు. 27వ అభ్యర్థి ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. ఎలిమినేషన్‌ రౌండ్స్‌లో కాంగ్రెస్‌‌కు 220 ఓట్లు రాగా, BRSకు 139 ఓట్లు, BJPకి 118 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 76 ఓట్లు పోలయ్యాయి. మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Similar News

News September 15, 2025

NLG: దసరా వస్తోంది.. జీతాలేవీ..?

image

NLG జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెలలుగా ఎదురుచూపులు తప్పడం లేదు. గ్రామాలు స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను తమపై వేసుకుని జిల్లాలో 868 జీపీల్లో పనిచేసే కార్మికుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. తక్కువ జీతం సైతం సకాలంలో రాక కుటుంబ పోషణకు అప్పులు చేస్తున్నారు. బతుకమ్మ, దసరా పండుగ సమీపిస్తుండడంతో నూతన వస్త్రాలు, ఇతర సామగ్రి కొనుగోలు చేద్దామంటే చేతిలో డబ్బులు లేక దిక్కులు చూస్తున్నారు.

News September 15, 2025

NLG: దొడ్డు బియ్యంపై మౌనమేల?

image

NLG జిల్లాలోని రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి. జిల్లాలో గోదాములు, MLS పాయింట్లతో పాటు రేషన్ షాపుల్లో 6వేల మెట్రిక్ టన్నుల వరకు దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వాటిని ఏం చేయాలో తెలియక రేషన్ డీలర్లు సైతం ఇబ్బంది పడుతున్నారు. దొడ్డు బియ్యం నుంచి పురుగులు సన్నబియ్యానికి పడుతున్నాయని లబ్ధిదారులు అంటున్నారు.

News September 15, 2025

NLG: 17 నుంచి పోషణ మాసం షురూ

image

ఆరోగ్యకర సమాజ నిర్మాణంతో పాటు మాతా శిశు సంరక్షణ కోసం అధికారులు పోషణ మాసం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోషణ్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఉద్యమంగా భావించి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నల్గొండ జిల్లాలోని 2,093 అంగన్వాడి కేంద్రాల్లో ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు పోషణ మాసం నిర్వహించనుంది. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు చూసి రిజిస్టర్లో నమోదు చేయనున్నారు.