News September 14, 2024
NLG: పట్టుదలతో కృషి చేస్తేనే లక్ష్యం సాధించవచ్చు: జిల్లా కలెక్టర్
పట్టుదలతో కృషి చేస్తేనే లక్ష్యాన్ని సాధించవచ్చని నల్గొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుక్రవారం అన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల గ్రౌండ్, ఆట స్థలాన్ని, హాస్టల్ ను, తరగతి గదులను, కిచెన్, టాయిలెట్స్, స్టోర్ రూంలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆటలాడుతున్న విద్యార్థులతో ముఖాముఖి ముచ్చటించారు.
Similar News
News October 7, 2024
NLG: ఉపాధి ప్రణాళికకు అధికారుల కసరత్తు
జిల్లాలో ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించడమే లక్ష్యంగా అధికారులు ఉపాధి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 84 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి పనుల గుర్తింపునకు శ్రీకారం చుట్టిన అధికారులు ఈ నెలాఖరులోగా పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించారు. నవంబర్ మాసం చివరినాటికి పనుల లక్ష్యాన్ని నిర్ధారించనున్నారు. జిల్లాలో 3,58,571 జాబు కార్డులు ఉన్నాయి.
News October 7, 2024
NLG: కూతురుతో కలిసి తల్లి మిస్సింగ్
కుటుంబ తగాదాలతో భర్తతో గొడవపడి కుమార్తెను తీసుకుని మహిళ ఇంటి నుంచి వెళ్లిపోయింది. నల్గొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన కత్తుల సుధ తన భర్త ప్రసాద్‌తో గొడవపడి కుమార్తె కావ్యను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. సుధ మానసికవ్యాధితో బాధపడుతుందని ఆమె అత్త కత్తుల ప్రమీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News October 6, 2024
బెల్ట్ షాపులు తీసేస్తే రూ.10 లక్షలు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపులు నిర్మూలించిన గ్రామాలకు వెంటనే రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బెల్ట్ షాపుల నిర్మూలనతో గ్రామంలోని వారు మద్యం సేవించకుండా పని చేసుకుంటున్నారని ఎమ్మెల్యేకు మహిళలు వివరించారు. అంతేకాకుండా బెల్ట్ షాపుల మూసివేతకు పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.