News February 5, 2025
NLG: పరిషత్తు.. కసరత్తు
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. తాజాగా మండల జిల్లా పరిషత్ ఎన్నికలే మొదట నిర్వహిస్తామని చెబుతుండటంతో యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తుంది. జిల్లాలో 33 జడ్పీటీసీలు, 352 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న GP ఓటర్ల జాబితా ఆధారంగా ఎంపీటీసీ ఓటర్ల జాబితాను తయారు చేయనున్నారు.
Similar News
News February 5, 2025
చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు.. ఎస్పీ సూచనలు
చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం పరిశీలించారు. బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షణ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
News February 5, 2025
చెర్వుగట్టులో ఆటో వాలాల దోపిడీ: భక్తులు
చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలలో ఆటోల దోపిడీకి అంతులేకుండా పోయిందని భక్తులు మండిపడుతున్నారు. గుట్టపైకి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఆటోల డ్రైవర్లు భక్తుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటున్నారు. ఒక్కో భక్తుడి వద్ద గుట్ట పైకి వెళ్లడానికే రూ.20ల ఛార్జి తీసుకున్నారని చెబుతున్నారు. ఆటోలపై అధికారుల నియంత్రణ లేకపోవడం పట్ల భక్తులు మండిపడుతున్నారు.
News February 5, 2025
NLG: 33 జడ్పీటీసీలు.. 352కు చేరిన ఎంపీసీటీలు!
2016లో జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లాలో 31 మండలాలు ఉండగా వాటి పరిధిలో 31 జడ్పీటీసీ, 349 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. ఆ తర్వాత జిల్లాలో రెండు మండలాలను పెంచారు. గట్టుప్పల్, గుడిపల్లి మండలాలు ఏర్పడడంతో మండలాల సంఖ్య 33కు పెరిగింది. దీంతో జడ్పీటీసీలు కూడా 33 కానున్నాయి. ఎంపీటీసీల పునర్విభజన చేపట్టడంతో మూడు ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. దీంతో ఎంపీటీసీల సంఖ్య 352కు చేరింది.