News February 5, 2025
NLG: పరిషత్తు.. కసరత్తు

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. తాజాగా మండల జిల్లా పరిషత్ ఎన్నికలే మొదట నిర్వహిస్తామని చెబుతుండటంతో యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తుంది. జిల్లాలో 33 జడ్పీటీసీలు, 352 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న GP ఓటర్ల జాబితా ఆధారంగా ఎంపీటీసీ ఓటర్ల జాబితాను తయారు చేయనున్నారు.
Similar News
News February 17, 2025
ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్ష

NLG: ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు గ్రామాల సందర్శన సందర్భంగా పాఠశాలలు, హాస్టళ్లలో అత్యవసరంగా పనులు చేపట్టాల్సి వస్తే ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంఎస్ఓ లు,ఎంఈఓలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు,ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. ఆదర్శ పాఠశాలలో అత్యవసర పనులు అయితే వెంటనే ప్రతిపాదనలు పంపించాలన్నారు.
News February 17, 2025
NLG: ఫైనాన్స్, భార్యాభర్తల సమస్యలపై వినతులు

NLG: ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో ఇవాళ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 35 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ రోజు భూ సమస్యలు, ఫైనాన్స్ సమస్యలు, భార్యాభర్తల సమస్యలపై వినతులు సమర్పించారు.
News February 17, 2025
MGU: బీఓయస్‌గా డా.బెల్లి యాదయ్య

MG యూనివర్సిటీ తెలుగు శాఖకి బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్ పర్సన్‌గా డాక్టర్ బెల్లి యాదయ్య బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ బెల్లి యాదయ్య ప్రస్తుతం నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధాన ఆచార్యులుగా, తెలుగులో అసోసియేట్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా MG యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, ఆర్ట్స్ & సోషల్ సైన్సెస్ కళాశాల డీన్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డిలు ఆయన్ను ప్రశంసించారు.