News August 22, 2024

NLG: పర్యావరణహితుడు .. మన సైదులు!

image

చౌటుప్పల్ కు చెందిన నిల్లిగొండ సైదులు ఏటా మట్టి గణేశ్‌ విగ్రహాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు తమవంతుగా కృషి చేస్తున్నారు. బీఎస్సీ చదివి స్వయం ఉపాధిగా కులవృత్తిని ఎంచుకున్న సైదులు.. సొంతూరిలో కుండలతో పాటు గ్రామ దేవతల విగ్రహాలు, పూజకు అవసరమయ్యే వస్తువులను మట్టితో తయారు చేస్తూ పర్యావరణహితుడిగా పేరు పొందాడు. ఈ ఏడాది 20 వేల మట్టి గణపతి విగ్రహాలను తయారు చేసినట్లు తెలిపారు.

Similar News

News September 18, 2025

నల్లొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక ఆదేశాలు

image

పెండింగ్‌లో ఉన్న సదరం కేసులను వచ్చే నెలలోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డీఆర్డీవో శేఖర్ రెడ్డిని ఆదేశించారు. గురువారం ఆమె నల్గొండలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహించే సదరం శిబిరాన్ని సందర్శించారు. పార్టిషన్ పనులు పూర్తయ్యాక, సదరం క్యాంపులను ఆసుపత్రి నూతన భవనంలో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న 2,564 సదరం దరఖాస్తులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

News September 18, 2025

NLG: ఇంటర్ ఫలితాలు తిరోగమనం…!

image

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో నల్గొండ జిల్లా తిరోగమనం వైపుగా పయనిస్తోంది. మూడేళ్లుగా జిల్లాలో ఫలితాలు తగ్గుముఖం పడుతున్నాయి. గతేడాది జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో నిలువగా.. ఈ సారి మాత్రం ప్రథమ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రంలో 13వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 12వ స్థానానికి పడిపోయింది. మెరుగైన ఫలితాలు సాధించేందుకు యంత్రాంగం దృష్టి సారించాలని పేరెంట్స్ కోరుతున్నారు.

News September 18, 2025

ఎంజీయూలో వివిధ విభాగాలకు నూతన అధిపతుల నియామకం

image

మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని వివిధ విభాగాలకు నూతన అధిపతులను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. రసాయన శాస్త్ర విభాగానికి డా. ఎం.జ్యోతి, గణిత శాస్త్ర విభాగానికి డా. జి.ఉపేందర్‌రెడ్డి, భౌతిక శాస్త్ర విభాగానికి డా. శాంత కుమారి, రసాయన శాస్త్ర విభాగం బీఓఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్)గా డా. ఆర్.రూప నియమితులయ్యారు. వీరు రెండేళ్ల పాటు ఆయా విభాగాలకు అధిపతులుగా వ్యవహరిస్తారు.