News February 26, 2025
NLG: పెరుగుతున్న టెంపరేచర్.. కలెక్టర్ సమీక్ష

ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం తన చాంబర్లో వడదెబ్బపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, అందువల్ల వడదెబ్బ గురి కాకుండా అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News February 26, 2025
నల్గొండ: గుండెపోటుతో వ్యక్తి మృతి

చండూరు మండలం నెర్మటలో పండుగ పూట తీవ్ర విషాదం జరిగింది. గుండెపోటుతో దోటి లింగయ్య (45) అనే వ్యక్తి మృతిచెందాడు. ఉదయం పొలం దగ్గరకు వెళ్లొచ్చాడని అంతలోనే ఛాతిలో నొప్పు వస్తుందని కుప్పకూలాడని గ్రామస్థులు తెలిపారు. లింగయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 26, 2025
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు: డీఎంహెచ్వో

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని డీఎంహెచ్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. NLG డీఎంహెచ్ఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నిషియన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజూ పీహెచ్సీలకు వచ్చే రోగుల రక్తనమూనాలు సేకరించి తెలంగాణ హబ్కు పంపాలన్నారు.
News February 26, 2025
NLG: వెక్కిరిస్తున్న ఈ -పాలన!

జిల్లాలోని గ్రామపంచాయతీల్లో ఈ-పాలన అటకెక్కింది. టీ ఫైబర్ పథకంలో భాగంగా ప్రతి పంచాయతీల్లో కేబుల్తో పాటు పరికరాలు బిగించి కనెక్షన్ ఇవ్వడం మరిచారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రతీ పంచాయతీలో ఈ పాలన, ఇంటింటికి తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందించాలన్న లక్ష్యంతో 2017లో ప్రభుత్వం టి ఫైబర్ సేవలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.