News October 1, 2024

NLG: పోలీసుల కనుసన్నల్లోనే కేటీఆర్‌పై దాడి: జగదీశ్ రెడ్డి

image

తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మూసీ పరివాహక ప్రాంతాల భాదితులను కలిసేందుకు వెళ్లిన కేటీఆర్ కాన్వాయ్‌పై దాడి హేయమైన చర్య అన్నారు. పోలీసుల కనుసన్నల్లోనే పథకం ప్రకారం దాడి జరిగింది అని అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్‌ను ఆపి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసేందుకు పోలీసులు సహకరించారు అని తెలిపారు.

Similar News

News October 2, 2024

భువనగిరి: ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సమీక్ష సమావేశం

image

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రయోగాత్మక సర్వేను పక్కాగా జరిపించాలని కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్డుల జారీ కోసం ప్రయోగాత్మకంగా ఈ నెల 3 నుంచి చేపట్టనున్న ప్రయోగాత్మక సర్వేను పక్కాగా జరిపించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News October 1, 2024

పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని నల్గొండ,సూర్యాపేట, యాదాద్రి జిల్లావాసులు ఆలోచనలు పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.

News October 1, 2024

జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం

image

ఉమ్మడి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పదవి కాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా ఓటర్ నమోదుకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.