News April 4, 2024

NLG: పోస్టల్ బ్యాలెట్ పై కలెక్టర్ సమీక్ష

image

లోక్ సభ ఎన్నికల సందర్బంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, ఎన్నికల అధికారి హరిచందన అన్నారు. గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉన్న FCI, BSNL, రైల్వే, వైద్య ఆరోగ్య, ట్రాన్స్పోర్ట్, TSSPDCL, తదితర శాఖల నోడల్ అధికారులతో పోస్టల్ బ్యాలెట్ పై సమీక్షించారు.

Similar News

News April 16, 2026

నల్గొండ: పునర్విభజనపై గుత్తా ఆశలు

image

నియోజకవర్గాల పునర్విభజన వార్తలతో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. వచ్చే ఏడాది నవంబరుతో ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుండటంతో, ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. జిల్లాలో కొత్తగా ఆరు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్న అంచనాల మధ్య నకిరేకల్, మిర్యాలగూడ లేదా నల్గొండ స్థానాల నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు.

News April 15, 2026

ఎండిపోతున్న కృష్ణమ్మ: డెడ్ స్టోరేజీకి నాగార్జునసాగర్

image

తెలుగు రాష్ట్రాల వరప్రదాయని నాగార్జునసాగర్ జలాశయం నీటి కొరతతో వెలవెలబోతోంది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో సాగు, తాగునీటి సరఫరాపై నీలినీడలు కమ్ముకున్నాయి. లక్షల ఎకరాల ఆయకట్టు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. కృష్ణా బేసిన్ అంతటా నీటి మట్టాలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.

News April 15, 2026

నాగార్జునసాగర్ మీదుగా 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే

image

హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీ నుంచి బందరు పోర్టు వరకు నాగార్జునసాగర్ నియోజకవర్గం మీదుగా 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు ప్రాథమిక అలైన్‌మెంట్ సిద్ధమైంది. ఈ మార్గం 2 రాష్ట్రాలు, 5 జిల్లాలు, 100 గ్రామాల మీదుగా 297 కి.మీ. పొడవున సాగుతుంది. తెలంగాణలో 40, ఏపీలో 60 గ్రామాలు పరిధిలోకి వస్తాయి. డీపీఆర్‌ కోసం కన్సల్టెంట్ల ఎంపిక జరుగుతుండగా, డిసెంబరు నాటికి పూర్తి అలైన్‌మెంట్ ఖరారయ్యే అవకాశ ఉందని అధికారుల అంచనా.