News July 4, 2024
NLG: ప్రజల చెంత ప్రజావాణి

ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా ఇక నుంచి మున్సిపల్ వార్డుల్లోనూ నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి నిర్ణయించారు. నేటి నుంచి ప్రతి గురువారం జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలతోపాటు , NLG, MLG, HLY, నందికొండ, DVK, CDR, CTL, NKL మున్సిపల్ పట్టణాల్లోని వార్డుల్లో సంబంధిత ఉద్యోగులు ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించనున్నారు.
Similar News
News December 17, 2025
నల్గొండ: ఓట్ల కోసం నోట్ల వరద.. రూ.కోట్లలో ఖర్చు

నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం హద్దులు దాటిందని ప్రజలు అంటున్నారు. ఓటుకు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. చిన్న పంచాయతీల్లో రూ.20 లక్షలకు పైగా ఖర్చు చేయగా, కీలక పంచాయతీల్లో అభ్యర్థులు రూ.కోటికి మించి పంపిణీ చేశారన్నారు. గెలిచినవారితో పాటు ఓడినవారు కూడా ఖర్చును తలచుకుని మదనపడుతున్నారు. క్రాస్ ఓటింగ్‌తో లెక్కింపు ఉత్కంఠగా మారింది.
News December 17, 2025
NLG: ‘లెక్కలు చెప్పాల్సిందే..! లేదంటే వేటు తప్పదు’

జిల్లాలో తొలి, మలి విడతల్లో నిర్వహించిన ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు 45 రోజుల్లోగా ఎన్నికల ఖర్చును MPDOలకు తెలియజేసి రశీదు తీసుకోవాలి. లేదంటే వేటు పడే ప్రమాదం ఉంది. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమకు గుర్తులు కేటాయించిన నాటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అయిన ఖర్చుల వివరాలు సమర్పించాలని ఎంపీడీవో జ్ఞానప్రకాశరావు తెలిపారు.
News December 17, 2025
నల్గొండ: @9AM.. పోలింగ్ శాతం ఎంతంటే?

నల్గొండ జిల్లా దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 9 మండలాలలో 9 గంటల వరకు 29.46% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం ఓటర్లు 2,53,689 ఉండగా 41,285 పురుషులు, 33,439 మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు.


