News March 24, 2024
NLG: ప్రయాణికుల కనీస సౌకర్యాలు పట్టని ఆర్టీసీ

ఉమ్మడి జిల్లాలో RTC బస్సుల్లో ప్రయాణించే వారికి భద్రతతోపాటు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. బస్టాండ్లలో తాగునీరు, బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సులు కనిపించని పరిస్థితి నెలకొంది. బస్సుల్లో ప్రయాణించే వారి టికెట్ పై పల్లె వెలుగుల్లో రూ.2, ఇతర బస్సుల్లో రూ.6 చొప్పున సెస్ రూపంలో వసూలు చేస్తున్నారు. ఇలా సంవత్సరానికి కోట్లాది రూపాయలు సమకూరుతున్నా ప్రయాణికులకు కనీస సౌకర్యాలు, భద్రత కల్పించడం లేదు.
Similar News
News December 5, 2025
NLG: సీఎం పర్యటన.. 1,500 మంది పోలీసులతో భద్రత

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో దేవరకొండ నియోజకవర్గంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. సీఎం భద్రతా సిబ్బందితో సమన్వయం చేసుకుని సుమారు 1,500 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ వివరించారు.
News December 5, 2025
NLG: గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి: మంత్రి

నల్గొండ జిల్లా తిప్పర్తి, జొన్నలగడ్డ గూడెం గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత అభివృద్ధి పనుల కోసం నిధులను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
News December 5, 2025
NLG: త్రివిధ దళాలకు సహకారం అవసరం: నల్గొండ కలెక్టర్

దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న త్రివిధ దళాలకు (ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్) ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఈనెల 7న నిర్వహించనున్న సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆమె మాట్లాడారు. ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు మనమంతా సహకరించాల్సిన బాధ్యత ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.


