News January 8, 2025
NLG: ప్రాణాలు తీస్తున్న పొగమంచు!

వెన్నులో వణుకు పుట్టించే చలికి పొగమంచు తోడైంది. రాత్రి నుంచి ఉ. 9గంటల దాకా దట్టంగా మంచు కురుస్తుండటంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. రోడ్లపై వాహనాలు కనిపించక పరస్పరం ఢీకొని రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ఇటీవల నల్గొండలో రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరోకరికి తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. అత్యవసరమైతే తప్ప రాత్రి ప్రయాణాలు చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News October 26, 2025
నల్గొండ: మద్యం దుకాణాలకు ఈ నెల 27న డ్రా

2025- 27కు సంబంధించి నల్గొండ జిల్లాలోని 154 మద్యం దుకాణాలకు 4,906 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రమణ తెలిపారు. ఈనెల 27న ఉదయం 11 గంటలకు నల్గొండలోని హైదరాబాద్ రోడ్లో గల లక్ష్మి గార్డెన్స్లో కలెక్టర్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల ఎంపిక లాటరీ ద్వారా జరుగుతుందన్నారు. డ్రా ప్రారంభ సమయంలో మీడియాకు అనుమతి లేదని, డ్రా పూర్తిగా ముగిసిన తర్వాత మీడియాకు వివరాలు అందజేస్తామన్నారు.
News October 25, 2025
NLG: టార్పాలిన్ కవర్లు లేక రైతుల తీవ్ర అవస్థలు

నల్గొండ జిల్లాలో టార్పాలిన్ కవర్లు లేక రైతులు ధాన్యాన్ని కాపాడుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సబ్సిడీ కవర్ల సమస్య జిల్లా వ్యాప్తంగా ఉంది. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో కిరాయి కవర్ల భారం తడిసిమోపడవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం కవర్లు అందించడం లేదని తెలిపారు.
News October 25, 2025
బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలని మిల్లర్లకు కలెక్టర్ ఆదేశం

వానాకాలం ధాన్యం సేకరణలో భాగంగా ఇంకా బ్యాంక్ గ్యారంటీలు సమర్పించని రైస్ మిల్లర్లు తక్షణమే వాటిని అందజేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆమె మిల్లర్లతో సమావేశమయ్యారు. ధాన్యం తడవకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా వెంటనే అన్లోడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.


