News January 8, 2025
NLG: ప్రాణాలు తీస్తున్న పొగమంచు!
వెన్నులో వణుకు పుట్టించే చలికి పొగమంచు తోడైంది. రాత్రి నుంచి ఉ. 9గంటల దాకా దట్టంగా మంచు కురుస్తుండటంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. రోడ్లపై వాహనాలు కనిపించక పరస్పరం ఢీకొని రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ఇటీవల నల్గొండలో రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరోకరికి తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. అత్యవసరమైతే తప్ప రాత్రి ప్రయాణాలు చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News January 14, 2025
SRPT: కూతురిపై లైంగిక వేధింపులు.. భర్త హత్య
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ఆదివారం రాత్రి సైదులు అనే వ్యక్తిని అతని ఇద్దరి భార్యలు <<15142827>>మర్డర్ చేసిన<<>> సంగతి తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. చివ్వెంల మండలానికి చెందిన సైదులు కారు డ్రైవర్. కొన్ని రోజులుగా పెద్ద భార్య కూతురిని అతను లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఇద్దరు భార్యలు రోకలిబండతో సైదులును హతమార్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
News January 14, 2025
NLG: మరో 12 రోజులే.. దగ్గర పడుతున్న గడువు!
మునిసిపల్ పాలకవర్గాల గడువు దగ్గర పడుతోంది. SRPT జిల్లాలో నేరేడుచర్ల, HZNR, KDD, SRPT, తిరుమలగిరి, NLG జిల్లాలో నందికొండ, NLG, NKL, MLG, HLY, DVK, CTL, CDR, యాదాద్రి BNG జిల్లాలో యాదగిరి గుట్ట, పోచంపల్లి, మోత్కూరు, CPL, BNG, ఆలేరు మున్సిపాలిటీల పదవీకాలం ఈనెల 26తో గడువు ముగియనుంది. ఈ మున్సిపాలిటీలకు ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
News January 14, 2025
25 నుంచి జాన్‌పహాడ్ ఉర్సు.. దర్గా చరిత్ర ఇదే
ఈ నెల 25నుంచి జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలు జరగనున్నాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ఉన్న ఈ దర్గాకు 400 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కల నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా భక్తులు వస్తారని అంటున్నారు. మత సామరస్యానికి జాన్ పహాడ్ సైదన్న దర్గా ప్రతీక. కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తుల నమ్మకం. కాగా ఈ దర్గాకు నేరేడుచర్ల, దామరచర్ల నుంచి వెళ్లొచ్చు.