News June 29, 2024

NLG: ప్రాదేశిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే!

image

ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రాదేశిక ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదవీకాలం కొద్ది రోజులే ఉండటంతో ఇంతలో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. జులై 4న జిల్లా, మండల పరిషత్ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్ల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో వారిని కొనసాగిస్తారా? లేక ప్రత్యేక అధికారులకు బాధ్యతను అప్పగిస్తారా అనే విషయం సందిగ్ధంగా మారింది.

Similar News

News December 21, 2025

నల్గొండ జిల్లాలో టుడే ఈవెంట్స్

image

నల్గొండ: ముగిసిన TMREIS జిల్లా స్థాయి క్రీడా పోటీలు
చిట్యాల: సీపీఐ పరువు నిలిపిన ఆ ఒక్కడు
కట్టంగూరు: ఇలాగే ఉంటే రోగాలు రావా?
నల్గొండ: నారుమళ్లపై పంజా విసురుతున్న చలి
నల్గొండ: మీరు మారరా?
నకిరేకల్: కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు
మర్రిగూడ: హామీని నిలబెట్టుకున్న ఎమ్మెల్యే
మిర్యాలగూడ: నకిలీ కంటి వైద్యుల బాగోతం
మునుగోడు: అంగన్ వాడీల కల నెరవేరేనా?
నల్గొండ: నామినేటెడ్ పదవులు వచ్చేనా?

News December 21, 2025

NLG: రికార్డ్.. ఒక్కరోజే 56,734 కేసుల పరిష్కారం

image

నల్గొండ జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 56,734 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఏర్పాటు చేసిన 16 బెంచీల ద్వారా పెండింగ్‌, ప్రి-లిటిగేషన్‌ కేసులను కొలిక్కి తెచ్చారు. ఇందులో భాగంగా బాధితులకు రూ.4.93 కోట్ల బీమా సొమ్ము, బ్యాంకు రుణాల కింద రూ. 37.76 లక్షలు, సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో రూ. 2.73 లక్షల రికవరీ ఇప్పించారు.

News December 21, 2025

ఎలక్షన్ ఎఫెక్ట్.. మంద కొడిగానే బియ్యం పంపిణీ..!

image

జిల్లాలో రేషన్ బియ్యం విక్రయాలు డిసెంబర్ మాసంలో మందకొడిగా సాగాయి. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల ప్రభావం ప్రజా పంపిణీ కేంద్రాలపై పడింది. పల్లె పోరులో చాలా బిజీగా ఉన్న లబ్ధిదారులు రేషన్ దుకాణాల వంక చూడకపోవడంతో ఆయా దుకాణాలలో బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. 23 మండలాల్లో బియ్యం పంపిణీ 35 శాతానికి మించలేదు. దీంతో మరో రెండు మూడు రోజులపాటు సరఫరా చేయనున్నట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు.