News February 12, 2025
NLG: ప్రారంభమైన నామినేషన్‌ల ఉపసంహరణ

వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. నల్గొండ కలెక్టరేట్లోని ఎమ్మెల్సీ ఎన్నిక రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉపసంహరించుకోవాలని, ఉపసంహరణకు ఒక్కరోజే సమయమని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా 1 నామినేషన్ తిరస్కరణకు గురి కాగా 22 మంది బరిలో ఉన్నారు.
Similar News
News March 27, 2025
వనపర్తి: క్రీడాకారులు, నిర్వాహకులను అభినందించిన ఎస్పీ

వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం క్రీడా మైదానంలో మెడికల్ విద్యార్థులకు నిర్వహించిన వార్షిక క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులతో పాటు, క్రీడల నిర్వాహకులను జిల్లా ఎస్పీ గిరిధర్ అభినందించారు. ఈ క్రీడల ద్వారా మీ శారీరక దేహ దారుఢ్యం మెరుగుపడుతుండటంతోపాటు, పని ఒత్తిళ్లను అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ కిరణ్మయి, వైద్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News March 27, 2025
సైదాపూర్ : ట్రాక్టర్ కిందపడి వ్యక్తి దుర్మరణం

ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సోమారం ఆదర్శ పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున మక్కల లోడుతో సైదాపూర్ నుంచి శంకరపట్నం వైపు వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ దాని కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రైతులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News March 27, 2025
ఖమ్మం: భవనం కూలిన ఘటనలో భద్రాచలంవాసి మృతి.. (UPDATE)

భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్‌లో బుధవారం <<15895820>>భవనం కూలిన ఘటన<<>>లో 9 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. రాత్రి రెండు గంటల సమయంలో శిథిలాల్లో చిక్కుకున్న భద్రాచలానికి చెందిన చల్లా కామేశ్వరరావును సహాయక బృందాలు వెలికితీశాయి. కాగా, ఆ సమయంలో అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శిథిలాల కింద ఉపేంద్ర అనే వ్యక్తిని కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.