News March 23, 2025

NLG: బర్డ్ ఫ్లూ ఉద్ధృతి.. 52 RRT బృందాల ఏర్పాట్లు

image

ఉమ్మడి NLG జిల్లాలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. వ్యాధి ఉద్ధృతి నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ 52 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను (RRT) ఏర్పాటు చేసింది. కోళ్ల శాంపిల్స్ సేకరించేందుకు వీరికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు. కాగా గుండ్రాంపల్లి, నేలపట్ల, దోతిగూడెం గ్రామాల్లో వేలకొద్ది గుడ్లు, టన్నుల కొద్ది ఫీడ్‌ను అధికారులు ఇప్పటికే పూడ్చారు. ఆ ప్రాంతాల నుంచి 3 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్‌గా ప్రకటించారు.

Similar News

News February 28, 2026

తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: కలెక్టర్ ఆదేశం

image

ఎండాకాలంలో ప్రజలకు, పశువులకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 100 రోజుల కార్యచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసి, తాగునీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పురోగతి సాధించాలని స్పష్టం చేశారు.

News February 28, 2026

నల్గొండలో ఉపాధి నిధుల రాజకీయం

image

నల్గొండ ఉమ్మడి జిల్లాకు ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ. 211.36 కోట్ల నిధుల పంపిణీ ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. గత రెండేళ్లుగా నిధుల కొరతతో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ వాటా కోసం పట్టుబడుతుండటమే దీనికి కారణం. గతంలో మంత్రి కోమటిరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా మధ్య జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో, తాజా నిధుల కేటాయింపు అంశం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

News February 27, 2026

NLG: ఇంటర్ పరీక్షలు.. మూడోరోజు 339 మంది గైర్హాజరు

image

జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 339 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ వెల్లడించారు. జనరల్ విభాగంలో మొత్తం 11,751 మంది విద్యార్థులకు గాను 11,535 మంది హాజరుకాగా, 216 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,566 మంది విద్యార్థులకు గాను 1,443 మంది హాజరుకాగా, 123 మంది గైర్హాజరయ్యారు.