News March 23, 2025

NLG: బర్డ్ ఫ్లూ ఉద్ధృతి.. 52 RRT బృందాల ఏర్పాట్లు

image

ఉమ్మడి NLG జిల్లాలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. వ్యాధి ఉద్ధృతి నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ 52 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను (RRT) ఏర్పాటు చేసింది. కోళ్ల శాంపిల్స్ సేకరించేందుకు వీరికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు. కాగా గుండ్రాంపల్లి, నేలపట్ల, దోతిగూడెం గ్రామాల్లో వేలకొద్ది గుడ్లు, టన్నుల కొద్ది ఫీడ్‌ను అధికారులు ఇప్పటికే పూడ్చారు. ఆ ప్రాంతాల నుంచి 3 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్‌గా ప్రకటించారు.

Similar News

News October 21, 2025

లింగంపేట అమరవీరుల స్థూపం వద్ద FLAG DAY

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ ఫ్లాగ్ డేను చందుర్తి మండలం లింగంపేటలోని అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎం.హరిత, జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే హాజరుకానున్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు.

News October 21, 2025

అమలాపురం: పోలీసు అమరవీరులకు ఘన నివాళులు

image

అమలాపురంలో మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లాలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు స్థూపం వద్ద మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులను సత్కరించారు.

News October 21, 2025

తిరుపతి: వలస నేతలతో కలిసి ఉండలేకున్నారు..!

image

తిరుపతిలో కొందరు వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు టీడీపీ, జనసేనలో చేరారు. డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ సైతం కూటమికి జైకొట్టారు. అయినప్పటికీ.. ‘నారాయణ నగదు వసూళ్ల దందా చేస్తున్నారు’ అని టీడీపీ నాయకులే ఆయనను విమర్శిస్తున్నారు. వైసీపీలో అంతా తామై వ్యహరించామని.. ఇప్పుడు కూటమిలో ఉంటూ ఆ పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదురు కావడంతో వారంతా షాక్‌కు గురవుతున్నారు. కూటమి పార్టీలతో ఇమడలేక లోలోన మదనపడుతున్నారంట.