News March 23, 2025

NLG: బర్డ్ ఫ్లూ ఉద్ధృతి.. 52 RRT బృందాల ఏర్పాట్లు

image

ఉమ్మడి NLG జిల్లాలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. వ్యాధి ఉద్ధృతి నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ 52 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను (RRT) ఏర్పాటు చేసింది. కోళ్ల శాంపిల్స్ సేకరించేందుకు వీరికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు. కాగా గుండ్రాంపల్లి, నేలపట్ల, దోతిగూడెం గ్రామాల్లో వేలకొద్ది గుడ్లు, టన్నుల కొద్ది ఫీడ్‌ను అధికారులు ఇప్పటికే పూడ్చారు. ఆ ప్రాంతాల నుంచి 3 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్‌గా ప్రకటించారు.

Similar News

News November 11, 2025

HYD: డ్యూయల్ డిగ్రీ BSC కోర్సుకు కౌన్సెలింగ్

image

రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ BSC (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు వాక్-ఇన్-కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు PJTAU రిజిస్ట్రార్ డా.విద్యాసాగర్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో గురువారం కౌన్సెలింగ్‌కి హాజరు కావాలన్నారు.

News November 11, 2025

కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్.. Way2Newsలో వేగంగా..

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ఈ సాయంత్రం విడుదల కానున్నాయి. సా.6.30 గం.కు వివిధ ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించనున్నాయి. Way2Newsలో వేగంగా వాటిని తెలుసుకోవచ్చు. మరోవైపు ఈ నెల 14న ఎన్నికల తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి.

News November 11, 2025

వనపర్తి: ‘ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’

image

వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ (CO-ED) కళాశాలలో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రఘునందన్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.