News December 31, 2024

NLG: ‘బీజేపీ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలి’

image

బీజేపీ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా పిలుపునిచ్చారు. సోమవారం సీపీఐ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నల్గొండ ఎన్జీ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీతో పాటు కమ్యూనిస్టు పార్టీ కూడా పోరాటం చేసిందన్నారు. అదే స్ఫూర్తితో మతోన్మాధ బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు.

Similar News

News January 6, 2025

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని NLG జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖతో పాటు, అన్ని శాఖల అధికారులు ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

News January 6, 2025

NLG: MGU LAW ఫలితాలు విడుదల

image

నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం లా ఐదు సంవత్సరాల పదవ సెమిస్టర్ (రెగ్యులర్‌) & 5, 6, 7, 8, 9 సెమిస్టర్ల (బ్యాక్లాగ్) ఫలితాలను విడుదల చేసినట్లు సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. అలాగే మూడు సంవత్సరాల లా డిగ్రీ ఆరవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. వివరాలకు https://mguniversity.in/వెబ్సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

News January 6, 2025

భువనగిరి: KTRకు చామల కౌంటర్.. మీ కామెంట్?

image

రైతుభరోసాపై KTRట్వీట్‌కు భువనగిరి MP చామల కిరణ్ కౌంటర్ ఇచ్చారు. వరి వేస్తే ఉరి అన్న మీరెక్కడ..? అత్యధికం ధాన్యం కొనుగోలు చేసి చరిత్ర సృష్టించిన మేమెక్కడ..? అని మండిపడ్డారు. రాళ్లు రప్పలకు పెట్టుబడి పేరిట రూ.22 వేల కోట్లు మింగిన BRSతో మా కాంగ్రెస్‌కు పోలికా..? అని ధ్వజమెత్తారు. రైతు భరోసా రూ.12 వేలు, బోనస్ రూ.500 ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామని X(ట్విట్టర్)లో పేర్కొన్నారు. MP వ్యాఖ్యలపై మీ కామెంట్..?