News February 5, 2025

NLG: బీడు భూముల్లో బంగారం పండిస్తున్నాడు

image

నల్గొండ జిల్లా చందంపేట మండలం అంటేనే బీడు భూములు, కరువు కాటకాలతో కూడిన ప్రాంతం. భూగర్భ జలాలు లేక రైతులు అల్లాడుతుంటారు. ఆ బీడు భూముల్లోనే బంగారం పడిస్తున్నాడు రైతు పద్మారెడ్డి. వినూత్నంగా తన 12ఎకరాల్లో 1991లోనే 1200 కుంకుడు మొక్కలు నాటి ఎకరాకు రూ.5వేల పెట్టుడితో రూ.13లక్షల ఆదాయం పొందుతున్నాడు. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల దిగుబడి సాధిస్తూ.. కిలో కుంకుడుకాయలు రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నాడు.

Similar News

News January 25, 2026

NLG: ఇక నియోజకవర్గంలోనే యూరియా బుకింగ్

image

రైతుల ఇబ్బందులను తీర్చేందుకు వ్యవసాయ శాఖ నియోజకవర్గ స్థాయిలోనే ప్రత్యేక యాప్‌లో యూరియా బుకింగ్ చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆ యాప్‌లో స్వల్ప మార్పులు చేర్పులు చేసింది. దీంతో నియోజకవర్గ పరిధి యాప్‌లోనే యూరియా బుక్ చేసుకునేలా శనివారం నుంచి కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు 4,38,529 యూరియా బస్తాలను కొనుగోలు చేశారు.

News January 25, 2026

నల్గొండకు ‘బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్’ అవార్డు

image

నల్గొండ జిల్లాకు రాష్ట్రస్థాయిలో ‘బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్’ అవార్డు లభించింది. ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను మొన్నటి వరకు కలెక్టర్‌గా పనిచేసిన ఇలా త్రిపాఠి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె NZB కలెక్టర్‌గా బదిలీ కాగా, జిల్లా అధికారులు జనవరి 25న HYD రవీంద్రభారతిలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించారు.

News January 24, 2026

చిట్యాల: లారీ నడుపుతూ గుండెపోటుతో మృతి

image

లారీ నడుపుతుండగానే గుండెపోటు రావడంతో ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకకు చెందిన ఎండీ నాసిర్ (61) ముంబై నుంచి విశాఖపట్నంకు లారీలో వెళ్తుండగా.. చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద ఛాతీనొప్పి రావడంతో లారీని పక్కకు ఆపారు. స్థానికులు 108కి సమాచారం అందించగా, సిబ్బంది వచ్చేలోపే ఆయన మృతి చెందారు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.