News February 5, 2025
NLG: బీడు భూముల్లో బంగారం పండిస్తున్నాడు

నల్గొండ జిల్లా చందంపేట మండలం అంటేనే బీడు భూములు, కరువు కాటకాలతో కూడిన ప్రాంతం. భూగర్భ జలాలు లేక రైతులు అల్లాడుతుంటారు. ఆ బీడు భూముల్లోనే బంగారం పడిస్తున్నాడు రైతు పద్మారెడ్డి. వినూత్నంగా తన 12ఎకరాల్లో 1991లోనే 1200 కుంకుడు మొక్కలు నాటి ఎకరాకు రూ.5వేల పెట్టుడితో రూ.13లక్షల ఆదాయం పొందుతున్నాడు. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల దిగుబడి సాధిస్తూ.. కిలో కుంకుడుకాయలు రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నాడు.
Similar News
News December 5, 2025
పారిశ్రామికవేత్తల దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్

వివిధ పథకాలు క్రింద మంజూరైన యూనిట్లు త్వరగా ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం శుక్రవారం కలెక్టరేట్ లో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చేసుకున్న దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలన్నారు. ఎపిఐఐసి భూములకు సంబంధించిన దస్త్రాలు త్వరగా పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News December 5, 2025
నిరంతర ట్రాకింగ్‌కు కేంద్రం ప్రతిపాదనలు! వ్యతిరేకిస్తున్న సెల్ కంపెనీలు

శాటిలైట్ ఆధారిత లొకేషన్ ట్రాకింగ్ (A-GPS) సిస్టమ్‌ను యాక్టివ్‌లో ఉంచడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. సెల్ టవర్ డేటా ఆధారంగా కేసులను దర్యాప్తు సంస్థలు విచారిస్తుంటాయి. దీనికి టెలికం సంస్థల డేటాపై ఆధారపడతాయి. కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించాలంటే A-GPS తప్పనిసరి చేయాలని టెలికం సంస్థలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. అయితే ప్రైవసీకి భంగం కలుగుతుందని సెల్ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి.
News December 5, 2025
ANU: LLB 5 సంవత్సరాల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత ఏప్రిల్ నెలల్లో జరిగిన BA LLB 5 సంవత్సరాల ఫస్ట్ సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు యూనివర్సిటీలోని సంబంధిత కార్యాలయంలోని అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.


