News September 27, 2024
NLG: బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్..!
తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ… బతుకమ్మ పండుగకు ముందు 9, 5,3 రోజులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంప్రదాయం పాటించే కన్నెపిల్లలు, బాలికలు మట్టితో చేసిన బొడ్డెమ్మలను పెట్టి, పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్’ అంటూ కోలాటం ఆడతారు. మరి మీ గ్రామంలో బొడ్డెమ్మ పండుగ చేస్తే Way2Newsకు ఫొటోలతో వార్త పంపండి.
Similar News
News October 12, 2024
కోదాడ: గిరిజన బిడ్డ.. సత్తా చాటింది..!
ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో కోదాడ మండలం బాలాజీ నగర్‌కు చెందిన గిరిజన విద్యార్థిని బానోతు శివ ప్రియాంక ఎస్జీటీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. గిరిజన పేద కుటుంబానికి చెందిన శివ ప్రియాంక తల్లిదండ్రులు ప్రోత్సాహంతో విద్యను అభ్యసిస్తూ మొదటి సారి డీఎస్సీ పరీక్షలు రాశారు. కాగా, శివ ప్రియాంక ఎస్టీ విభాగంలో 4వ ర్యాంక్ సాధించారు. దీంతో పలువురు గ్రామస్థులు ఆమెను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
News October 12, 2024
నల్గొండ: ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
విజయదశమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ అన్నింటా శుభం చేకూరాలని, విజయాలకు చిహ్నమే విజయదశమి పండుగ అని, ఈ విజయదశమి అందరిలో శాంతి, శ్రేయస్సు, సంతోషాన్ని పెంపొందించాలని, దుర్గామాత కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నారు.
News October 12, 2024
NLG: అధ్వానంగా రహదారులు.. ప్రజల ఇబ్బందులు
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లోని పలు గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఏళ్ల తరబడి రోడ్లు ఇలానే ఉన్నా పట్టించుకునే నాథుడే లేరని, గుంతలుగా మారిన రహదారులపై ప్రయాణించి ప్రమాదాల బారిన పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోతె మండలంలో మరీ అధ్వానంగా ఉన్నాయన్నారు. మీ గ్రామంలో రోడ్లు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.